సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని రసూల్పూరా బస్తీలో ప్రెసిడెంట్, బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర పర్యటించారు. వార్డు మెంబర్ సదా కేశవరెడ్డితో కలిసి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల భారీ వర్షాలకు నాలా పొంగి ఇళ్లలోకి నీరు వచ్చిందని స్థానికులు తెలిపారు.
నాలాలో పూడికతీత పనులు చేపట్టి, వైశాల్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాండు, అశోక్ గౌడ్, సూరి, రామకృష్ణ పాల్గొన్నారు.