నిధులు లేవనే సాకుతో బోర్డు సభ్యులు.. కంటోన్మెంట్‌లోని రెండోవార్టు, రసూల్‌పుర పరిధిలోని ఇందిరమ్మ నగర్ బస్తీ వాసులకు తాగునీటిని దూరం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత, కంటోన్మెంట్ ప్రధాన కార్యదర్శి శాంసన్ రాజు ఆరోపించారు. స్థానిక కాలనీ వాసులతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ గోడును ఆయనకు వినిపించుకోగా వారిపక్షాన పోరాడేందుకు సిద్ధపడినట్లు వెల్లడించారు. దాదాపు 200 ఇల్లున్న ఈ బస్తీలో గత ఐదు సంవత్సరాల క్రితం డీడీలు చెల్లించగా ఇప్పటివరకు నిదుల్లేవని పేద ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు.
మురికి నీటిని తాగి అనారోగ్యాల పాలైనా పాట్టించుకునే నాథుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తెరాస కార్పొరేటర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పెడ చెవిన పెట్టారని, కనీసం కరోనా విజృంభిస్తోన్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. బస్తీలో కేవలం ఓట్లు లేవనే కారణంగానే అభివృద్ధికి వీరిని దూరం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే బోర్డు సభ్యుడు స్థానిక నాయకులు వీరి సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో రానున్న కాలంలో ఉద్యమ బాట తప్పదని శాంసన్‌రాజు హెచ్చరించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ఛైర్మన్ యాదగిరి, అన్ననగర్ మురళి, రమేష్, శ్రీను, నర్సింగ్, జైపాల్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్