కంటోన్మెంట్ బోర్డులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు... తమ జీతభత్యాలను చెల్లించాలంటూ బోర్డు ఎదుట నిరసనకు దిగారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు దూరప్రాంతాల్లో కాకుండా... వారి నివాసానికి సమీపంలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన విషయం తెలుసుకున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అక్కడకు చేరుకొని... జీతభత్యాలను సకాలంలో చెల్లించాలని కంటోన్మెంట్ సీఈవో చంద్రశేఖర్‌కు ఆదేశాలు జారీ చేశారు .కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు వారి ఇంటి సమీపంలోనే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్మికులను ఒక చోటి నుండి మరో చోటికి బదిలీ చేయడం విషయం పై అధికారులతో చర్చించారు. త్వరలోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:స్పీకర్, మండలి ఛైర్మన్‌కు హైకోర్టు నోటీసులు