జీహెచ్ఎంసీ పరిధిలో అమల్లోకి వచ్చిన ఉచిత తాగునీటి సరఫరా పథకాన్ని త్వరలోనే కంటోన్మెంట్ ప్రాంతంలో అమల్లోకి తెస్తామని కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఉచిత నీటి సరఫరా విషయంలో ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తోన్న ఇతర సంక్షేమ పథకాల మాదిరిగానే ఉచిత నీటి సరఫరా పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేయనున్నట్లు మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ విషయమై మంత్రి కేటీఆర్‌ను కలిశామని తెలిపారు. ఆయన త్వరలోనే తీపి కబురు అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పాటు పడకపోగా ఆ ప్రాంతానికి ఉచిత నీటిని తీసుకురాని పక్షంలో కేటీఆర్ చిత్రపటాన్ని కాలుస్తామని భాజపా నేతలు అనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. గత ఉపాధ్యక్షుడు రామకృష్ణ చేసిన విమర్శలపై స్పందించిన మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
ఇదీ చదవండి: వర్డ్ వార్: మందేసి బస్సెక్కిన హోంగార్డు.. మధ్యలో దిగమన్న కండక్టర్