తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి సెలవును ఆర్టీసీ యాజమాన్యం తిరస్కరించింది. ఆరు నెలలు సెలవు కోరుతూ లేఖ రాశారు. ఆర్టీసీ సమ్మెతో సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లిందని.. ఇలాంటి పరిస్థితుల్లో సెలవులు మంజూరు చేయలేమని ఎంజీబీఎస్ కస్టమర్ రిలేషన్ అధికారి స్పష్టం చేశారు. తక్షణమే విధుల్లో చేరాలని పేర్కొన్నారు. విధులకు హాజరుకాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండి : షాపింగ్ మాల్లో సందడి చేసిన రష్మిక మందన