ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ హైదరాబాద్లోని ముషీరాబాద్ బస్ డిపో నుంచి రాంనగర్ చౌరస్తా వరకు ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: డేటా వార్ 2.0: జియో గిగాఫైబర్ X ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్