క్యాన్సర్ మహమ్మారి.. మనిషిని శారీరకంగానే కాదు.. మానసికంగానూ దెబ్బతీసే వ్యాధి. అయితే అలాంటి క్యాన్సర్‌ను జయించిన 108 మంది వ్యక్తుల కథలతో ఒక పుస్తకంను ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయ ఆనంద్‌రెడ్డి రచించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం నగరంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి, మాజీ స్పిన్ బౌలర్ వెంకటపతి రాజు సంయుక్తంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తాము సినిమాల్లో కేవలం మానసికంగా బలవంతులుగా నటిస్తామని, నిజంగా క్యాన్సర్‌ను జయించిన వారే నిజమైన హీరోలని రకుల్ పేర్కొన్నారు. స్నేహితుల దినోత్సవం రోజున ఇలాంటి పుస్తకాన్ని ఆవిష్కరించటం ఆనందంగా ఉందని సంగీతారెడ్డి తెలిపారు. వైద్యులను స్నేహితులుగా చూడాలని కోరారు.
ఇదీ చూడండి : పిల్లలకు తల్లిపాలే ఎంతో శ్రేష్ఠం