ETV Bharat / state

వైద్య ఆరోగ్య సిబ్బందికి సెలవుల రద్దు - hyderabad news

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అదనంగా 25 శాతం పడకలు పెంచాలని ఆదేశించింది. మొత్తం పడకల్లో 70 శాతం కరోనా రోగులకు ఉపయోగించాలని నిర్దేశించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంపిక చేసిన సాధారణ శస్త్రచికిత్సలను వెంటనే వాయిదా వేసుకోవాలని తెలిపింది. కరోనా బాధితులను ఆసుపత్రుల్లో చేర్చేందుకు ప్రత్యేక ప్రొటోకాల్‌ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఆక్సిజన్‌ నిల్వలను అందుబాటులో ఉంచాలని సూచించింది. ప్రజలందరూ మాస్కులు విధిగా ధరిస్తూ, వ్యక్తిగత దూరం పాటించాలని..ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దని కోరింది.

cancellation-of-leave-for-medical-health-personnel
వైద్య ఆరోగ్య సిబ్బందికి సెలవుల రద్దు
author img

By

Published : Apr 16, 2021, 6:35 AM IST

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అన్ని జిల్లాల్లో పరీక్షలు, టీకాల కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కరోనాపై ఆయన గురువారం బీఆర్‌కే భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పాజిటివ్‌ కేసులు పెరిగితే ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కరోనా సంరక్షణ కేంద్రాలను రెట్టింపు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ను సక్రమంగా వినియోగించాలని, వృథాను అరికట్టాలని చెప్పారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా కృషిచేయాలని సూచించారు. సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రిజ్వి, ప్రీతిమీనా, రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, గంగాధర్‌, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కోలుకున్న సీఎస్‌

ఈ నెల 6న కరోనా బారిన పడిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కోలుకున్నారు. బుధవారం ఆయనకు నెగెటివ్‌ నివేదిక రావడంతో గురువారం విధులకు హాజరయ్యారు.

జినోమ్‌ వ్యాలీలో టీకాల కార్యక్రమం

హైదరాబాద్‌ శివార్లలోని జినోమ్‌వ్యాలీలో గురువారం కరోనా టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. బయోలాజికల్‌-ఇ, ఇతర సంస్థలకు చెందిన ఉద్యోగులకు ఈ సందర్భంగా కొవాగ్జిన్‌ టీకా మొదటి డోసు ఇచ్చారు. ఐసీఎంఆర్‌ సలహాదారు బీపీ ఆచార్య తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనా కట్టడికి ఆ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.