మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ఏయస్ రావు నగర్లోని కెనరా బ్యాంక్లో కాయిన్స్ మేళాను అధికారులు ప్రారంభించారు. డిజిటల్ యుగంలో వినియోగదారులకు, చిన్న చిన్న వ్యాపారుల కోసం తమ బ్యాంక్ ఇలా మేళాను నిర్వహించడం అభినందనీయమని మేనేజర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. నగరంలో మొత్తం 65 బ్రాంచిల్లో వినియోగదారులు కాయిన్స్ తీసుకోవచ్చని అన్నారు. ఆర్థిక నేరాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : మీ 'బాస్'కన్నా మీరే సమర్థంగా పని చేయగలరా...?