ETV Bharat / state

కేఫ్ నీలోఫర్ బాబురావు.. ఓ మంచి చాయ్​ లాంటి కథ - కేఫ్ నీలోఫర్ బాబురావు

40 ఏళ్ల క్రితం అతనో సాధారణ వ్యక్తి. పొట్టకూటి కోసం హైదరాబాద్‌ వచ్చాడు. ఓ చాయ్‌ దుకాణంలో స్వీపర్‌గా చేరాడు. ప్రస్తుతం ఆ కేఫ్‌కు యజమానయ్యాడు. ఆయన ఎవరో కాదు... తేనీటి రంగంలో ఓ బ్రాండ్‌ సృష్టించిన కేఫ్‌ నీలోఫర్‌ బాబురావు. ఆయన జీవితకథేంటో మనము తెలుసుకుందామా..!

కేఫ్ నీలోఫర్ బాబురావు
author img

By

Published : Mar 21, 2019, 12:06 AM IST

Updated : Mar 21, 2019, 7:09 AM IST

కేఫ్ నీలోఫర్ బాబురావు ...ఓ మంచి చాయ్​ లాంటి కథ...!
ఓ పదహారేళ్ల కుర్రాడు బతుకుదెరువు కోసం రైలెక్కి పట్నం బాటపట్టాడు. బట్టల దుకాణంలో చేరి ఆకలిపోరాటం మొదలుపెట్టాడు. పొట్ట నిండేదే కానీ చిల్లి గవ్వ మిగిలేది కాదు. అలా కాదని... ఓ చాయ్ దుకాణంలో స్వీపర్​గా చేరాడు. మెల్లిమెల్లిగా ఎదిగి అదే దుకాణానికి యజమానిగా మారాడు. తేనీటి రంగంలో ఓ బ్రాండ్​ను సృష్టించాడు. ఆయనే కేఫ్ నీలోఫర్ యజమాని బాబురావు.

స్వీపర్‌గా వచ్చి ఓనర్‌రయ్యాడు:

బాబురావుది పాత ఆదిలాబాద్ జిల్లా దహేగాం మండలంలోని లగ్గం గ్రామం. ఉపాధి కోసం చిన్నతనంలోనే కింగ్ కోఠిలోని రాక్సీ హోటల్​లో సర్వీస్ బాయ్​గా చేరాడు. అక్కడే ఓ వ్యక్తికి బాబురావు పనితనం నచ్చింది. రెడ్​హిల్స్​లోని కేఫ్ నీలోఫర్ టీ అండ్ బేకరీకి తీసుకెళ్లి పనిచ్చాడు. అంచలంచెలుగా ఎదుగుతూ ఆ కేఫ్​కు యజమానయ్యారు. ఇదంతా అంత సులభంగా జరగలేదు. 40 ఏళ్ల క్రితం స్వయంగా టీ పొడి తయారు చేయించడం, చిక్కటి పాలతో చవక ధరకే టీ ఇవ్వడం మొదలుపెట్టాడు. మొదట్లో నష్టాలు వచ్చినా భరించాడు.

సేవాకార్యక్రమాల్లోనూ ముందు:

రెడ్​హిల్స్​లోనే నాలుగు అంతస్తుల్లో అత్యాధునిక వసతులతో 2016లో నూతన కేఫ్​ ఏర్పాటు చేశారు. ఆదాయంలో కొంతభాగం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఎంఎన్​జే క్యాన్సర్ ఆసుపత్రికి వచ్చే రోగులకు నిత్యం అన్నదానం చేస్తూ తృప్తి పొందుతున్నారు.

కేఫ్​లో ఉద్యోగులను సొంత మనుషులుగా చూసుకునే గొప్పగుణం బాబురావుది. యజమాని ఆదరాభిమానాలు చూసి జీవితాంతం ఇక్కడే ఉండి పనిచేసుకుంటామని చెబుతున్నారు కేఫ్ ఉద్యోగులు.

బాబురావు తనయుడు శశాంక్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. బీటెక్ పూర్తి చేసిన శశాంక్...నీలోఫర్​నుమరింత అభివృద్ధి చేసే దిశగా శ్రమిస్తున్నాడు.

Intro:Body:Conclusion:
Last Updated : Mar 21, 2019, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.