ETV Bharat / state

బుక్ చేసిన క్యాబ్ ఎంతకీ పికప్ లోకేషన్​కు రావట్లేదా.. ఇక ఆ సమస్య తీరినట్లే..

Cabs have to pay Fines for Delay: క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థలైన ఓలా, ఉబర్‌ల జిమ్మిక్కులకు అడ్డుకట్ట వేసే అవకాశం వినియోగదారులకు లభించింది. బుక్‌ చేసినా ఎంతకీ పికప్‌ లొకేషన్‌కు రాకుండా ఇబ్బందిపెడుతున్న ఘటనలకు పుల్‌స్టాప్‌ పెట్టకపోతే జరిమానాలు తప్పవని వినియోగదారుల కమిషన్లు స్పష్టం చేస్తున్నాయి. ప్రజా రవాణా సేవల్లో లోపాలపై కమిషన్లను ఆశ్రయించొచ్చని సూచిస్తున్నాయి.

Cabs
Cabs
author img

By

Published : Nov 14, 2022, 5:20 PM IST

Cabs have to pay Fines for Delay: క్యాబ్‌ సంస్థల జిమ్మిక్కులకు అడ్డుకట్ట వేసే పాశుపతాస్త్రం వినియోగదారులకు లభించింది. బుక్‌ చేసినా ఎంతకీ పికప్‌ లొకేషన్‌కు రాకుండా ఇబ్బందిపెడుతున్న ఘటనలకు పుల్‌స్టాప్‌ పెట్టకపోతే జరిమానాలు తప్పవని వినియోగదారుల కమిషన్లు స్పష్టం చేస్తున్నాయి. వినియోగదారులకు అసౌకర్యం కలిగించినట్టు నిర్ధారణ అయితే రైడ్‌ ఛార్జీలకు 20 రెట్లు చెల్లించాల్సి ఉంటుందని దేశవ్యాప్తంగా వినియోగదారుల కమిషన్లు వెలువరించిన తీర్పులతో స్పష్టమవుతోంది. ఇటీవలే మహారాష్ట్రలోని ‘థానే అదనపు జిల్లా వినియోగదారుల కమిషన్‌’ ఉబర్‌ సంస్థ తీరును తప్పుపట్టింది. పరిహారం చెల్లించాలంటూ ఆదేశించింది. క్యాబ్‌లు వాడే ప్రయాణికులు కమిషన్లను ఆశ్రయించొచ్చని సూచించింది.

డ్రైవర్లపై నియంత్రణ క్యాబ్‌ సంస్థల ఆధీనంలోనే.. : క్యాబ్‌ ఆలస్యంగా రావడం వల్ల విమానాన్ని సకాలంలో అందుకోలేకపోయినట్లు థానే పరిధిలోని డోంబివాలి(ఈస్ట్‌)కు చెందిన కవిత ఎస్‌ శర్మ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. రూ.10 వేల పరిహారం, కేసు ఖర్చులు రూ.10 వేలు చెల్లించాలని క్యాబ్‌ సంస్థను ఆదేశించింది. తాము యాప్‌ ద్వారా సాంకేతిక సేవలకు మాత్రమే పరిమితమని, డ్రైవర్లు థర్డ్‌పార్టీ కిందికి వస్తారని, వారి చర్యలకు తాము బాధ్యత వహించమంటూ క్యాబ్‌ సంస్థ వాదించింది. వినియోగదారులు యాప్‌ల ద్వారా సేవలు పొందుతున్నారని, డ్రైవర్లను నియమించేది, వారిపై నియంత్రణ అంతా క్యాబ్‌ సంస్థలదేనంటూ.. సేవల్లో లోపానికి బాధ్యత వహించాల్సిందేనని కమిషన్‌ స్పష్టం చేసింది.

అగ్రిగేటర్‌ పాలసీ నిబంధనలివి..

* ఛార్జీలో డ్రైవర్లకు 80 శాతం దక్కాలి.

* 24 గంటలు కాల్‌సెంటర్‌ నిర్వహించాలి.

* డ్రైవర్లకిచ్చే బేస్‌ ఛార్జి రూ.25-30గా ఉండాలి.

* డ్రైవర్లు 12 గంటలకు మించి పనిచేయరాదు.

* డ్రైవర్లకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల టర్మ్‌ బీమా ఇవ్వాలి. ఏటా 5 శాతం పెంచాలి.

* ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల సంక్షేమానికి అగ్రిగేటర్లు బాధ్యత వహించాలి. లేదంటే జరిమానా.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.