ETV Bharat / state

Sub committee review on house sites: 'అన్ని అంశాలపై సమగ్ర వివరాలు అందించండి' - అనుమతి లేని లేఔట్లు

ఇళ్ల స్థలాలు, సంబంధిత అంశాల పరిష్కారంపై మంత్రివర్గ ఉపసంఘం(Sub committee review on house sites) భేటీ ఇవాళ హైదరాబాద్​లో జరిగింది. అనుమతి లేని లేఔట్లు, గ్రామకంఠాల క్రమబద్ధీకరణపై సమీక్ష నిర్వహించింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలను వెల్లడించింది.

Sub committee review on house sites
మంత్రివర్గ ఉపసంఘం
author img

By

Published : Nov 9, 2021, 10:54 PM IST

నిరుపేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ సహా సంబంధిత అంశాలన్నింటిపై సమగ్ర వివరాలు అందించాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం(Sub committee review on house sites) ఆదేశించింది. అనుమతి లేని లేఔట్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం తొలిసారి హైదరాబాద్​లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సమీక్ష నిర్వహించింది. సీఎస్ సోమేశ్ కుమార్​తో పాటు పురపాలక, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

అనుమతి లేని లేఔట్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, గ్రామకంఠాలు, సంబంధిత అంశాలపై ఉపసంఘం సమావేశంలో చర్చించారు. అందుకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన సమాచారం, వివరాలపై సమీక్షించారు. ఇళ్ల స్థలాల సమస్యలతో సంబంధం ఉన్న అన్ని అంశాలపై సమగ్ర వివరాలను అందించాలని అధికారులను ఉపసంఘం ఆదేశించింది. వచ్చే వారం మరోసారి సమావేశం కావాలని ఉపసంఘం నిర్ణయించింది. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని, సబిత ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

పోడు భూములపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.