కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుపై మంత్రివర్గం చర్చించింది. ఈనెల 20 నుంచి కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో తాజా కేబినెట్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
రాష్ట్రంలో.. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించారు.
లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలా? వద్దా? లేక, రాష్ట్ర ప్రభుత్వపరంగా ప్రత్యేక నిబంధనలను అమలుచేయాలా.. అనే అంశాలపై కీలక నిర్ణయాలను తీసుకుంది.
ఈ నెల 25 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి చేపట్టాల్సిన చర్యలు కీలకం కానున్నాయి. ఈ అంశాలన్నింటిపై వివిధవర్గాల అభిప్రాయాలను సీఎం ఇప్పటికే సేకరించారు. వీటిపై సుదీర్ఘంగా మంత్రివర్గ భేటీలో చర్చించారు.