ETV Bharat / state

పెట్రోల్ ,డీజిల్ ధరలను తగ్గించాలని క్యాబ్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా - హైదరాబాద్ తాజా వార్తలు

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని తెలంగాణ క్యాబ్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెరిగిన ఇంధన ధరలతో వాహనాలు నడపలేక లేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

CAB DRIVER ASSOCIATION
క్యాబ్ డ్రైవర్ యూనియన్
author img

By

Published : Apr 4, 2022, 7:06 PM IST

హైదరాబాద్ ఎల్బీనగర్​లో తెలంగాణ క్యాబ్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టి పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. క్యాబ్స్​కి మీటర్ విధానం అమలు చేయాలన్నారు. ఒకే దేశం ఒకే టాక్స్ విధానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇంధన ధరలు తగ్గించకపోతే నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామన్నారు. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించాలని లేకపోతే అన్ని యూనియన్లు, అసోసియేషన్​లు మహాకూటమిగా ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు.

ఇంధన ధరలను తగ్గించాలని క్యాబ్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా

ఇదీ చదవండి: గ్యాస్, చమురు ధరల పెంపును ఖండిస్తూ కాంగ్రెస్ వినూత్న నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.