ETV Bharat / state

డెడ్​లైన్​ విధించడం దారుణమైన చర్య: రాఘవులు - cpm

ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ తమ మెుండి వైఖరిని మార్చుకొని... కార్మికులను చర్చలకు పిలవాలని సీపీఎం జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్​ చేశారు. విజయారెడ్డి హత్యను సీపీఎం ఖండిస్తుందన్నారు.

డెడ్​లైన్​ విధించడం దారుణమైన చర్య: రాఘవులు
author img

By

Published : Nov 5, 2019, 11:28 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమ మొండివైఖరిని మార్చుకొని... వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఎం జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్‌ చేశారు. తహసీల్దార్​ విజయారెడ్డి హత్యను సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా వ్యవహరించకుండా... ఇవాళ్టి వరకు డెడ్‌లైన్‌ విధించడం దారణమైన చర్య అని అభివర్ణించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. రేపు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర భాజపా తమ వైఖరిని తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

డెడ్​లైన్​ విధించడం దారుణమైన చర్య: రాఘవులు

ఇవీ చూడండి: పీసీసీ రేసులో నేను ఉన్నా: కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.