ETV Bharat / state

రాంప్రసాద్​ హత్యపై విచారణ వేగవంతం - Panjagutta_Murder

హైదరాబాద్​లో ఆదివారం రాత్రి ఓ వ్యాపారవేత్త దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. భాగ్యనగరంతో పాటు విజయవాడలోనూ అలజడి చెలరేగింది. విజయవాడకు చెందిన రాంప్రసాద్​ ఆదివారం రాత్రి పంజాగుట్టలోని  గుడికి వెళ్లివస్తుండగా  ముగ్గురు దుండగులు అతికిరాతకంగా దాడి చేశారు. బాధితుడు ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. కేసును ఛాలెంజ్​గా తీసుకున్న పోలీసులు నిందితుల వేటలో నిమగ్నమయ్యారు.

రాంప్రసాద్​ హత్యపై విచారణ వేగవంతం
author img

By

Published : Jul 8, 2019, 12:35 AM IST

రాంప్రసాద్​ హత్యపై విచారణ వేగవంతం

పంజాగుట్ట హత్య ఘటనపై విచారణను పోలీసులు వేగవంతం చేశారు. శనివారం పంజాగుట్టలోని వేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో దైవ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన రామ్​ప్రసాద్​పై ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నం చేసి.. అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన బాధితున్ని స్థానికులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించగా ఈ తెల్లవారుజామున చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.

పాతకక్షలే కారణం

పాత కక్షలతోనే వ్యాపార భాగస్వామి కోగంటి సత్యం అనే వ్యక్తే తన భర్తను హత్యచేయించాడని మృతుడి భార్య వైదేహి పంజాగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేసింది.

అలా మొదలైంది

మృతుడు రాంప్రసాద్​, కోగంటి సత్యం, బొండా ఉమ ముగ్గురు భాగస్వామ్యంగా 2005 నుంచి విజయవాడలోని కామాక్షి స్టీల్​ ఫ్యాక్టరీలు ప్రారంభించారు. కొన్ని కారణాలతో బొండా ఉమ తనవాటాను రాంప్రాసాద్​కు విక్రయించారు. అప్పటి నుంచి భాగస్వాములిద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి. డబ్బుల వ్యవహారంలో తేడాలు చేశాడంటూ రాంప్రసాద్​పై సత్యం ఆరోపణలు చేశాడు. 2013లో రాంప్రసాద్​ హైదరాబాద్​ వచ్చి స్థిరపడ్డాడు. సత్యం నుంచి తనకు ప్రాణహాని పొంచి ఉందంటూ 2018లో రాంప్రసాద్​ కృష్ణలంక ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కానీ అప్పులు తీర్చకుండా పారిపోయాడని సత్యం అనుచరులు ఆరోపిస్తున్నారు.

మాకేం సంబంధం లేదు

కేసును ఛాలెంజ్​గా తీసుకున్న పోలీసులు నిందితుల వేటలో ఉన్నారు. హత్యకు ఉపయోగించిన మరణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న ఆధ్వర్యంలో ఐదు బృందాలు రంగంలోకి దిగాయి. ఉద్దేశపూర్వకంగానే తమపై హత్యారోపణ చేస్తున్నారని కోగంటి సత్యం అనుచరులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: పంజాగుట్టలో వ్యాపారి మృతిపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.