చందానగర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రెండు కార్లు ఒక ఆటో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. రాణిగంజ్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు పటాన్చెరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న సమయంలో చందానగర్ గంగారం బస్‌స్టాప్ సమీపంలో డ్రైవర్ మల్లారెడ్డికి ఫిట్స్ వచ్చింది.బస్సు అదుపుతప్పి రహదారి పక్కన పార్కింగ్ చేసిన వాహనాల పైకి దూసుకుపోయింది.వాహనాల్లో ఎవరు లేకపోవటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. వెంటనే డ్రైవర్‌ను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందాడు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.
ప్రాణం పోయింది..! - DRIVER
బస్సు డ్రైవర్‌కి ఫిట్స్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ చందానగర్‌లో జరిగింది.