ETV Bharat / state

భవిష్యత్తులో మరిన్ని ఫెస్టివల్స్ నిర్వహిస్తాం: బుర్రా వెంకటేశం - బుర్రా వెంకటేశం

హైదరాబాద్‌ అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్నాక్స్‌ ఫెస్టివల్‌కు మంచి స్పందన లభించిందని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు.

భవిష్యత్తులో మరిన్ని ఫెస్టివల్స్ నిర్వహిస్తాం: బుర్రా వెంకటేశం
author img

By

Published : Sep 2, 2019, 4:16 AM IST

హైదరాబాద్‌ అమీర్‌పేట మెట్రో ఇంటర్​చేంజ్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్నాక్స్‌ ఫెస్టివల్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైలు, తెలంగాణ పర్యాటక శాఖలతో పాటు కల్చరల్‌ ల్యాంగ్వేజ్‌ ఇండియన్‌ కనెక్షన్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు స్నాక్స్‌ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఈ ఫెస్టివల్‌లో 7 దేశాలకు చెందిన వారితో పాటు దేశంలోని 10 రాష్ట్రాల వారు పాల్గొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని బుర్రా వెంకటేశం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఫెస్టివల్స్​ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

భవిష్యత్తులో మరిన్ని ఫెస్టివల్స్ నిర్వహిస్తాం: బుర్రా వెంకటేశం

ఇదీ చూడండి :అమెరికాలో భారతీయ పండుగ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.