హైదరాబాద్ అల్మాస్గూడలోని సీకేఆర్ నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. తిరుపతి రెడ్డి, శివకుమార్ అనే ఇద్దరి ఇళ్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాళాలు పగులగొట్టి నాలుగున్నర తులాల బంగారం, రూ.50వేల నగదును ఆపహరించారని బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి: ఏటీఎం ధ్వంసం చేసి చోరికి యత్నించిన దుండుగులు