ETV Bharat / state

పంచాయతీలపై విద్యుత్‌ దీపాల భారం!

పంచాయతీలపై విద్యుత్​ దీపాల నిర్వహణ భారం పెరగనుంది. వాటి ఏర్పాటు, నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఏడేళ్లపాటు ఈఈఎస్​ఎల్​ సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. ఒక్కో దీపంపై నిర్వహణ ఛార్జీల పేరిట భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై సర్పంచులు వ్యతిరేకంగా ఉన్నారు.

పంచాయతీలపై విద్యుత్‌ దీపాల భారం!
burden-of-maintenance-of-electric-lights-on-panchayats-in-telangana
author img

By

Published : Nov 7, 2020, 7:14 AM IST

గ్రామ పంచాయతీలపై వీధిదీపాల నిర్వహణ భారం పెరగనుంది. వాటి ఏర్పాటు, నిర్వహణ బాధ్యతను ఏడేళ్ల కాలానికి ఈఈఎస్‌ఎల్‌(ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌) సంస్థకు అప్పగించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా ఒక్కో దీపంపై నిర్వహణ ఛార్జీల పేరిట భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తనుంది. ఈ పరిణామంపై సర్పంచులు వ్యతిరేకంగా ఉన్నారు.
గ్రామాల్లో వీధిదీపాల నిర్వహణ, విద్యుత్తు ఛార్జీల చెల్లింపుల బాధ్యతను ఇప్పటి వరకూ పంచాయతీలు చూస్తున్నాయి. సర్కారు సూచనల మేరకు.. విద్యుత్తు బిల్లుల ఆదా, పారదర్శకత పేరిట వీధిదీపాల నిర్వహణ బాధ్యతను ఈఈఎస్‌ఎల్‌కు ఇచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో పాత దీపాలను తొలగించి ఎల్‌ఈడీ బల్బులను సంస్థ అమర్చనుంది. ఏర్పాటు వ్యయమంతా భరిస్తూ దీపాల సామర్థ్యం మేరకు ఒక్కోదానిపై రూ.2930 నుంచి రూ.9,990 వరకు వెచ్చించనుంది. ఏడేళ్లలో నిర్వహణ, కొత్త పెట్టుబడి బాధ్యత ఆ సంస్థదే. ఈ వ్యవధిలో పంచాయతీలు ఒక్కో దీపంపై విద్యుత్‌ ఛార్జీల కింద నెలకు రూ.104 నుంచి రూ.284 వరకు చెల్లించాలని అది సూచించింది. నెలవారీగా తమకు చెల్లించే నిర్వహణ ఛార్జీల్లో పెట్టుబడి వ్యయం తిరిగి రాబట్టడం, దీపాల సామగ్రి, ప్రాజెక్టు నిర్వహణ, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, డాష్‌బోర్డు నిర్వహణ ఖర్చులు మాత్రమే ఉంటాయని ఆ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. అయితే.. నిర్వహణ ఛార్జీల్లో నెలవారీ విద్యుత్తు ఛార్జీలు లేకపోవడంపై పంచాయతీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 120 దీపాలున్న గ్రామంలో నెలకు రూ.8వేల వరకు విద్యుత్తు ఛార్జీలు పడుతుంటే, ఒప్పందం ప్రకారం నిర్వహణ ఛార్జీల పేరిట కనీసం నెలకు రూ.12వేల వరకు భరించాల్సి పరిస్థితి తలెత్తుతుందని సర్పంచులు పేర్కొంటున్నారు.

ఇదీ విద్యుద్దీపాల పరిస్థితి...

  • గ్రామ పంచాయతీలు - 12,769
  • మొత్తం వీధిదీపాలు - 16,31,715
  • ఎల్​ఈడీ దీపాలు - 12,53,453
  • సీఎఫ్​ఎల్​ దీపాలు - 2,22,786
  • ట్యూబులైట్లు - 68,445
  • సాధారణ దీపాలు - 87,031

పెట్టుబడి నిర్వహణ వ్యయం ఇలా..

దీపం

సామర్థ్యం

పెట్టుబడి

వ్యయం

నిర్వహణ ఛార్జీ

(నెలకు)

18 వాట్స్​రూ.2930.94రూ.104.36
35 వాట్స్​రూ.3439.28రూ.117.34
70 వాట్స్​రూ.4710.86రూ.149.18
110 వాట్స్​రూ.6374.37రూ.192.67
190 వాట్స్​రూ.9990.68రూ.284.40

ఇవీ చూడండి: ఆర్థిక నష్టం, బడ్జెట్​పై ముఖ్యమంత్రి మధ్యంతర సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.