ETV Bharat / state

ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు - telangana varthalu

ఈ నెల 15నుంచి రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 18న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 10 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశముండగా.. రానున్న ఆర్థికసంవత్సరానికి బడ్జెట్ ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తైంది. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆమోదంతో బడ్జెట్ ప్రతిపాదనలు ఖరారు కానున్నాయి.

ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు

author img

By

Published : Mar 10, 2021, 4:24 AM IST

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆమోదించేందుకు శాసనసభ, శాసనమండలి ఈ నెల 15 నుంచి సమావేశం కానున్నాయి. ఈ మేరకు ఉభయసభలను సమావేశపరుస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సభామందిరంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం కానున్నారు. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం రెండు సభల సభావ్యవహారాల సంఘాలు సమావేశమై.... బడ్జెట్ సమావేశాల పనిదినాలు, ఎజెండాను ఖరారు చేస్తాయి. పదిరోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మరణించిన నాగార్జునసాగర్ శాసనసభ్యుడు, దివంగత నోముల నర్సింహయ్యకు 16న అసెంబ్లీ సంతాపం ప్రకటించనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రభుత్వ సమాధానం 17వ తేదీన ఉండే అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 18న ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

తుది కసరత్తు పూర్తయ్యాక కేటాయింపులు

బీఏసీలో ఖరారు చేసే ఎజెండా ప్రకారం బడ్జెట్‌పై సాధారణ చర్చ, పద్దులు, ద్రవ్యవినిమయబిల్లుపై చర్చతో పాటు ఇతర బిల్లులు, అంశాలపై చర్చ ఉంటుంది. బడ్జెట్ ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తైంది. వార్షికపద్దుకు సంబంధించిన కేటాయింపుల విధివిధానాలపై అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గత రెండు రోజులుగా వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు... ఆయా శాఖల ప్రతిపాదనలపై సమీక్షించారు. బడ్జెట్‌పై సీఎం తుది కసరత్తు పూర్తయ్యాక కేటాయింపులు ఖరారవుతాయి. అనంతరం, ఈ నెల 16 లేదా 17 తేదీల్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టతనిచ్చారు. ప్రస్తుత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు, ప్రాధాన్యతా రంగాలకు తగిన నిధులతో పాటు హామీల అమలుకు బడ్జెట్​లో కేటాయింపులు చేయనున్నారు.

కొవిడ్​ నిబంధనలకు లోబడే..

అటు ఉభయసభల సభ్యులనుద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగం సిద్ధమవుతోంది. సర్క్యులేషన్ విధానంలో ప్రసంగానికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు లోబడి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కొవిడ్‌ దృష్ట్యా గత బడ్జెట్ సమావేశాలను కుదించి.. కేవలం పదిరోజుల పాటే సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో ఏడో తేదీ నుంచి 16 వరకు వర్షాకాల సమావేశాలు జరిగాయి. జీహెచ్​ఎంసీ సహా ఇతర చట్టసవరణల బిల్లుల ఆమోదానికి ఆ సమావేశాలకు కొనసాగింపుగా అక్టోబర్ 13న మరొక రోజు సమావేశాలు జరిగాయి. అనంతరం ఈ నెల 15వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఇదీ చదవండి: 'ఎన్నికల కోడ్‌ ముగియగానే పీఆర్సీ, వయోపరిమితి పెంపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.