బడ్జెట్ సమావేశాలకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. సమావేశాల సన్నద్ధతపై వివిధ శాఖలు, పోలీసు అధికారులతో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఇవాళ సమావేశం కానున్నారు. సమావేశాల కోసం సన్నద్ధతతో పాటు ప్రశ్నలకు సమాధానాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన సమాచారం సహా సంబంధిత అంశాలపై సభాపతి సమీక్షిస్తారు. సమావేశాల కోసం భద్రతా ఏర్పాట్లపై చర్చిస్తారు.
అటు కరోనా మహమ్మారి నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించేలా చేయాల్సిన ఏర్పాట్లు, సంబంధిత అంశాలపై కూడా అధికారులతో చర్చించనున్నారు. కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లనూ పోచారం సమీక్షించనున్నారు.
ఇదీ చదవండి: గడువు దగ్గరపడుతున్నకొద్దీ జోరుగా ఎమ్మెల్సీ ప్రచారం