కేంద్ర ప్రభుత్వం పద్దు ప్రకటించిన నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ప్రత్యేకంగా అదనపు కేటాయింపులేవీ జరగలేదని ప్రభుత్వవర్గాలు అభిప్రాయపడ్డాయి. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో కొన్నింటికి మాత్రం అదనపు నిధులు కేటాయించింది. ఈ మేరకు ఆ నిధులు వచ్చే అవకాశం ఉంది.
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు నాలుగువేల కోట్లు, నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్‌కు ఆరువేల కోట్లు కేటాయించారు. నేషనల్ లైవ్లీహుడ్ మిషన్‌కు 3వేల కోట్లు, స్వాస్థ్బీమా పథకానికి నాలుగువేల కోట్లు కేటాయింపులు చేశారు. జాతీయ రహదారులకు పదివేల కోట్ల రూపాయిల వరకు పెంచారు, రాష్ట్రానికి పెద్దమొత్తంలో జాతీయ రహదారులు మంజూరైనందున ఆ నిధులు అదనంగా రానున్నాయి. ఇప్పటికే రైతుబంధు కింద రెండుసార్లు అన్నదాతల ఖాతాలకు సొమ్ము జమైంది. ఈ నేపథ్యంలో కేంద్రం రైతులకు ప్రకటించిన నగదు బదిలీ సత్వరమే అమలుకానుంది.
వృద్ధిరేటు గణనీయంగా నమోదవుతున్నందున ఈసారి పద్దు రెండు లక్షల కోట్ల రూపాయిలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటన తర్వాతే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రానుంది. దానికంటే ముందే బడ్జెట్ సమావేశాలను ముగించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.
15వ ఆర్థిక సంఘం పర్యటన తర్వాతే బడ్జెట్
కేంద్ర పద్దు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 15వ ఆర్థిక సంఘం ఈ నెల 18 నుంచి మూడు రోజుల పర్యటనకు రానుంది. ఆ తర్వాతే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం పద్దు ప్రకటించిన నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ప్రత్యేకంగా అదనపు కేటాయింపులేవీ జరగలేదని ప్రభుత్వవర్గాలు అభిప్రాయపడ్డాయి. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో కొన్నింటికి మాత్రం అదనపు నిధులు కేటాయించింది. ఈ మేరకు ఆ నిధులు వచ్చే అవకాశం ఉంది.
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు నాలుగువేల కోట్లు, నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్‌కు ఆరువేల కోట్లు కేటాయించారు. నేషనల్ లైవ్లీహుడ్ మిషన్‌కు 3వేల కోట్లు, స్వాస్థ్బీమా పథకానికి నాలుగువేల కోట్లు కేటాయింపులు చేశారు. జాతీయ రహదారులకు పదివేల కోట్ల రూపాయిల వరకు పెంచారు, రాష్ట్రానికి పెద్దమొత్తంలో జాతీయ రహదారులు మంజూరైనందున ఆ నిధులు అదనంగా రానున్నాయి. ఇప్పటికే రైతుబంధు కింద రెండుసార్లు అన్నదాతల ఖాతాలకు సొమ్ము జమైంది. ఈ నేపథ్యంలో కేంద్రం రైతులకు ప్రకటించిన నగదు బదిలీ సత్వరమే అమలుకానుంది.
వృద్ధిరేటు గణనీయంగా నమోదవుతున్నందున ఈసారి పద్దు రెండు లక్షల కోట్ల రూపాయిలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటన తర్వాతే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రానుంది. దానికంటే ముందే బడ్జెట్ సమావేశాలను ముగించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.
Body:sssbbb
Conclusion:ggg