2019-20 సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా రైతులు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేలా రూపొందించారు. బడ్జెట్‌లోని ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం.
- రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. 5 ఎకరాల లోపు రైతులకు ఏటా రూ.6 వేల ఆర్థిక సాయం
- అసంఘటిత కార్మికుల కోసం ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌ధన్. 60 ఏళ్లు నిండినవారికి నెలకు రూ.3 వేల పింఛన్
- ఆదాయపు పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు. స్టాండర్డు డిడక్షన్ పరిమితి రూ.40వేల నుంచి 50 వేలకు పెంపు
- ఇళ్ల కొనుగోలుదారులపై జీఎస్టీ భారం తగ్గించేందుకు చర్యలు
- ఐటీ రిటర్నుల దాఖలు 24 గంటల్లో పూర్తి చేసేందుకు చర్యలు
- మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి రూ. 60 వేల కోట్ల కేటాయింపు
- అందరికీ ఆహారం కోసం రూ.1.7 లక్షల కోట్లు కేటాయింపు
- ఆవుల సంరక్షణకు జాతీయ కామధేను పథకం. జాతీయ గోకుల్ మిషన్‌కు 750 కోట్ల కేటాయింపు
- పాడి, ఆక్వా రైతులకు వడ్డీ రాయితీలు ప్రకటన
- రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్ల కేటాయింపు
- వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష డిజిటల్ గ్రామాల ఏర్పాటు
- హరియాణాలో 22వ ఎయిమ్స్ ఏర్పాటు
- 21 వేల వేతనం వచ్చే వారికి కూడా ఈఎస్ఐ అమలు