ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దాసరి యశ్వంత్ అనే విద్యార్థి తన కళాప్రతిభను చాటుతూ మెరుపులా దూసుకెళ్తున్నాడు. సోనూసూద్ భారీ చిత్రాన్ని గీసి రికార్డులు సృష్టించిన యువకుడు... ఓవైపు బుల్లెట్ బండి నడుపుతూ మరోవైపు ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan fans news) చిత్రాన్ని గీశాడు. ఆదివారం సాయంత్రం ఇన్‌స్టా గ్రామ్ లైవ్ వీడియో ఆన్ చేసి ట్రాఫిక్‌లో 200 కేజీలున్న బుల్లెట్ బైక్ నడుపుతూనే పవన్ చిత్రాన్ని మూడు రకాలుగా గీశాడు. బుల్లెట్ బైక్ ఐదు కిలోమీటర్ల వరకు చేరుకోగానే ఈ మూడు చిత్రాలు పూర్తయ్యాయని యశ్వంత్ తెలిపాడు. తనకు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం అంటే ఆసక్తి అని.. పవన్‌పై ఉన్న అభిమానంతోనే(Pawan kalyan fans news) ఈ చిత్రాలు గీశానని పేర్కొన్నాడు. అంగళకుదురు నుంచి సంగం జాగర్లమూడి చేరుకునేలోగా అంటే 15.48 నిమిషాల్లో పూర్తయ్యాయని వివరించారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో సాయం కోరేవారికి అండగా నిలిచాడు నటుడు సోనూ సూద్. సమాజానికి ఆయన చేసిన సేవకు ముగ్ధుడైన ఓ విద్యార్థి సోనూ సూద్ చిత్రాన్ని ఇసుకలో రంగోలిని కలిపి.. 273 చదరపు మీటర్ల ప్రదేశంలో గీసి ఔరా అనిపించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధిస్తానని యశ్వంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యశ్వంత్‌కు చిన్ననాటి నుంచే చిత్రకళపై ఆసక్తి. తమ నైపుణ్యానికి మెరుగు పడుతూ తొలుత రెండు చేతులతో బొమ్మలను చూసి చిత్రాలు గీసేవాడు. మిగిలిన చిత్రకారుల కంటే ఎక్కువ గుర్తింపు రావాలనే ఆలోచనతో అతను తన కాళ్లకు కూడా పని చెప్పాడు. రెండు నెలల క్రితం సోనూ సూద్ బొమ్మను తలకిందులుగా నోటితో చిత్రీకరించాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. సోనూసూద్ దానిని చూసి 'త్వరలో కలుద్దాం' అని సమాధానం కూడా ఇచ్చారు. అక్కడితో ఆగని యశ్వంత్.. వరల్డ్ రికార్డ్స్ సాధించాలనే తపనతో 273 చదరపు మీటర్ల ప్రదేశంలో సోనూసూద్ చిత్రాన్ని చిత్రీకరించి పలువురి మన్ననలు పొందాడు. కేవలం 2.50 గంటల వ్యవధిలో ఈ చిత్రాన్ని తానే స్వయంగా చిత్రీకరించాడు. ఈ చిత్రంతో ప్రపంచ రికార్డు సాధిస్తే ఆ అవార్డుని సోనూసూద్‌కు(Sonu sood news) అంకితం చేస్తానని యశ్వంత్ పేర్కొన్నాడు. యశ్వంత్ ఘనత ప్రతిభపై ఆయన చదువుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గా కల్యాణి ఆనందం వ్యక్తం చేశారు. తన కొడుకు ఇలాంటి ఘనత సాధించడం సంతోషంగా ఉందని.. యశ్వంత్‌ను మరింత ప్రోత్సహిస్తానని ఆయన తండ్రి చెప్పారు.
యశ్వంత్ చిత్రించిన 273 చదరపు మీటర్ల సోనూసూద్ భారీ చిత్రం 12 ప్రపంచ రికార్డుల పుస్తకాల్లో నమోదైంది. ఈ వివరాలతో హైదరాబాద్‌కు చెందిన భారతి ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ సంస్థలు యశ్వంత్‌ను సత్కరించడానికి ఆహ్వానం పలికాయి. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఈ వేడుక నిర్వహించాయి.
ఇదీ చదవండి: Paddy cultivation requires: పంట మార్చితే బెటర్.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిఫారసు