ETV Bharat / state

పాదయాత్రకు బయలుదేరుతూ భావోద్వేగానికి లోనైన ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్​ - RS Bahujan Rajyadhikara Yatra

Bahujan Rajyadhikara Yatra: బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టడానికి ఇంటి నుంచి బయలుదేరుతూ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్ భావోద్వేగానికి లోనయ్యారు​. కుటుంబసభ్యులను దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. తరాల తలరాతను మార్చేందుకు సిద్ధమవుతున్నానంటూ.. కుటుంబీకులకు వీడ్కోలు చెబుతూ బరువైన హృదయంతో బయటకు నడిచారు. అనంతరం సికింద్రాబాద్​లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.

bahujan rajyadhikara yatra
బహుజన రాజ్యాధికార యాత్ర
author img

By

Published : Mar 6, 2022, 7:28 PM IST

Updated : Mar 6, 2022, 7:59 PM IST

Bahujan Rajyadhikara Yatra: నిరుద్యోగ యువత, అణగారిన వర్గాల అభ్యున్నతి, రైతుల శ్రేయస్సే లక్ష్యంగా... బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్ తలపెట్టిన 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్ర ప్రారంభమైంది. ముందుగా సికింద్రాబాద్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున బహుజన సమాజ్​ వాదీ పార్టీ శ్రేణులు తరలివచ్చారు. అక్కడి నుంచి జనగామ జిల్లా ఖిలాషాపూర్​ బయలుదేరారు.

భావోద్వేగంతో ఆర్​ఎస్​

అంతకుముందుగా ఇంటి నుంచి బయలుదేరిన ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్.. కుటుంబీకుల నుంచి వీడ్కోలు తీసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 300 రోజులు కుటుంబానికి దూరంగా ఉంటున్నానన్న భావన.. ఆయనను ఉద్వేగానికి గురిచేసింది. వారిని దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. 300 రోజుల పాటు కుటుంబంతో ఉండే అవకాశం లేదన్న భావన ఓ వైపు కలచి వేస్తున్నా.. బహుజన రాజ్య స్థాపన ద్వారా తరాల తలరాతను మార్చే చారిత్రక అవకాశం గొప్ప అవకాశమిచ్చిందని పేర్కొన్నారు.

  • #BahujanaYatra లో మూడు వందల రోజులు కుటుంబంతో నేనుండే అవకాశం లేదన్న విషయం కొంత ఉద్విగ్నానికి గురి చేసినా, బహుజన రాజ్య స్థాపన ద్వారా కొన్ని తరాల తలరాతలు మార్చే చారిత్రక అవకాశం గొప్ప ఉపశమనాన్నిచ్చింది.Bahujan Rule is a cause worth the sacrifice. #SaveTelangana #TelanganaWantsBSP pic.twitter.com/XeP8nOSawz

    — Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) March 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నియంత పాలన నుంచి విముక్తి

ప్రస్తుతం రాష్ట్రం కష్టాల్లో కూరుకుపోయిందని... యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని ప్రవీణ్​ కుమార్ అన్నారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన వారి త్యాగఫలాల మీద కేసీఆర్​ కుటుంబం రాజ్యమేలుతోందని ఆరోపించారు. ఈ యాత్ర ద్వారా రాష్ట్రానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తెరాస వైఫల్యాలను 300 రోజుల యాత్రలో ప్రజలకు వివరిస్తానని ప్రవీణ్​ కుమార్​ వెల్లడించారు.

  • All set for 300 days #BahujanaYatra in Telangana to liberate the masses. తెలంగాణను దోపిడి-నిరంకుశ పాలన నుండి విముక్తి చేయడానికి తలపెట్టిన 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్రకు నేను సిద్దం, మరి మీరు? तेलंगाना में बहुजन राज को सफल करने के लिए 300 दिन यात्रा के लिए मैं तय्यार।#BSP pic.twitter.com/1OkkrivfNH

ఇదీ చదవండి: జైలుకు వెళ్తాననే భయంతోనే కేసీఆర్ రాష్ట్రాల పర్యటన: బండి సంజయ్‌

Last Updated : Mar 6, 2022, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.