ETV Bharat / state

పేగు తెంచుకు పుట్టిన బిడ్డలే... యమపాశాలై.. - parents murder in telangana

పేగు తెంచుకు పుట్టిన బిడ్డలే... తల్లిదండ్రుల పాలిట యముడిలా ప్రవర్తిస్తున్నారు. కన్నవారన్న ఆలోచన లేకుండా గొంతు నులిమి చంపుతున్నారు. మరికొందరు బతికుండగానే చితికి పంపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా హత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వీటికి కారణం రెండే... ఒకటి ప్రేమ... మరొకటి ఆస్తి!

పేగు తెంచుకు పుట్టిన బిడ్డలే... యమపాశాలై..
author img

By

Published : Nov 1, 2019, 8:06 AM IST

పేగు తెంచుకు పుట్టిన బిడ్డలే... యమపాశాలై..

ఆస్తికోసం కన్న తల్లినే కూతురు హత్యచేసిన ఉదంతం ఏపీలోని గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. ఆస్తి వేరేవారికి రాస్తుందేమో అనే భావనతో కన్న తల్లి అనే కనికరం లేకుండా భర్త, బావతో కలిసి హత్యకు పాల్పడింది. గుంటూరులోని నగరపాలెం ప్రాంతానికి చెందిన ఆలపాటి లక్ష్మి... గురువారం హత్యకు గురైంది. తల్లిని కూతురు భార్గవి, ఆమె బావతో కలిసి అత్యంత దారుణంగా చంపేసింది. సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

అక్కడ మరీ దారుణం...

పిల్లలు లేరని తనను చేరదీసి పెంచిన 80 ఏళ్ల వృద్ధుడికి నిద్రలోనే నిప్పంటించాడు ఓ దత్తపుత్రుడు. తెలంగాణలోని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో గత మే నెలలో ఈ ఘటన జరిగింది. ఇల్లు, పొలాన్ని తన పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ తండ్రిపై కొడుకు ఒత్తిడి తెచ్చాడు. దీనికి తండ్రి ససేమిరా అనడం వల్ల అతడిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. మే 4న అర్ధరాత్రి వరండాలో నిద్రిస్తున్న తండ్రిపై... కొడుకు, కోడలు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఆ వృద్ధుడి కేకలతో ఇరుగుపొరుగు లేవగా.. ఎవరికీ అనుమానం రాకుండా మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. గాంధీ ఆస్పత్రిలో 33 రోజులపాటు చికిత్స పొంది ఆ వృద్ధుడు మృతి చెందాడు.

మన కళ్లల్లో వెలుగై.. పసితనంలో కంటికి రెప్పై.. బాల్యంలో చదువై.. యవ్వనంలో మార్గదర్శై.. ఉద్యోగ- వివాహాల్లో దిక్సూచియై.. నిలిచే తండ్రులనే కడతేరుస్తున్న నేటి కుమారులు మానవత్వానికే మాయని మచ్చ!?

ఆస్తి ముందు కన్న ప్రేమ చిన్నబోయింది...

న్యాయంగా ఆస్తి తనకు ఇచ్చినా సంతృప్తి చెందని ఓ కుమారుడు... తల్లి, తండ్రిని సజీవ దహనం చేశాడు. ఈ హృదయవిదారక ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలంలో జరిగింది. ఇంట్లో మంచంపై పడుకున్న వృద్ధ దంపతులు భూక్య దస్రు, భూక్య బాజుపై పెద్ద కొడుకు భూక్య కేతురాం కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. వారు తప్పించుకునే వీల్లేకుండా బయట తలుపులకు గడియ పెట్టేశాడు. దీంతో దంపతులు సజీవ దహనమయ్యారు.

అమ్మ స్థానం చెదిరిపోతోంది...

కుటుంబంలో అమ్మ స్థానం అపురూపం. ఇంటిని చక్కదిద్దిడంలోనైనా పిల్లలను తీర్చిదిద్దడంలోనైనా ఆమెది ప్రత్యేక స్థానం. విచ్చలవిడి సంస్కృతి మానవత్వాన్ని కాలరాస్తున్న ఈ తరుణంలో... అమ్మస్థానం చెదిరిపోతోంది. తన ఇంట్లో తానే శత్రువైపోతోంది. రెండు పదుల వయసైనా లేని ఓ యువతి వేసిన తప్పటడుగు కుటుంబంలో చిచ్చుపెట్టింది. ఒక కుర్రాడితో ప్రేమలో పడి... మరో యువకుడితో సన్నిహితంగా గడిపింది. ఇవన్నీ కాదన్నందుకు కక్ష పెంచుకుని కన్న తల్లిని చంపేసింది. 3 రోజులు తల్లి మృతదేహం ఇంట్లోనే పెట్టుకుని... ప్రియుడితో గడిపింది. చివరకు శవాన్ని రైలు పట్టాలపై పడేసి... ఏం తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దుర్ఘటన హైదరాబాద్​లోని హయత్​నగర్​లో జరిగింది.

"మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వమున్నవాడు" అని అందెశ్రీ రాసిన రాతలు నిజమేనేమో అనిపిస్తోంది! నవమాసాలు మోసి, కని, పెంచి పెద్దచేసిన కన్న తల్లులనే కడతేరుస్తున్న నేటి పిల్లలు పేగుబంధానికే కళంకం!?

ఇవీ చూడండి: కన్నపేగు రాసిన మరణశాసనమిది... రజిత హత్యకేసులో కీర్తి, శశి అరెస్ట్

Intro:Body:

story

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.