ETV Bharat / state

మోదీ ప్రభుత్వ వైఫల్యాలకు బడ్జెట్‌ గణాంకాలే నిదర్శనం: ఎమ్మెల్సీ కవిత - కేంద్ర బడ్జెట్ 2023 తాజా వార్తలు

MLC Kavitha on Union Budget 2023: మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌... గణాంకాలతో సహా నిరూపిస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. సబ్ కా సాత్ అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులను సమానంగా పంపిణీ చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. ఇది జాతీయ బడ్జెటా లేక... కొన్ని రాష్ట్రాల బడ్జెట్ మాత్రమేనా అని కవిత మండిపడ్డారు. దేశ ఆర్థిక వృద్ధిని నిర్ధేశించని బడ్జెట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.

MLC Kavitha
MLC Kavitha
author img

By

Published : Feb 1, 2023, 9:05 PM IST

MLC Kavitha on Union Budget 2023: తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు బడ్జెట్​లో ఏమీ ఇవ్వలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సబ్ కా సాత్ అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులను సమానంగా పంపిణీ చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. గతంలో మంజూరైన మెడికల్ కాలేజీల వద్దనే నర్సింగ్ కళాశాలలు పెట్టనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారని.. దానివల్ల తెలంగాణకు ఒక్కటీ రాదన్నారు. గుజరాత్​లోని గిఫ్ట్ సిటీకి 2025 వరకు పన్ను మినహాయింపును పొడిగించినప్పుడు... రాష్ట్రంలోని నిమ్జ్, ఇతర సెజ్​ల పరిస్థితి ఏమిటని కవిత నిలదీశారు. కొన్ని రాష్ట్రాల వైపే ఎందుకు చూస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

కేంద్ర బడ్జెట్​ మోదీ అంకెల గారడి : ఇది జాతీయ బడ్జెటా లేక... కొన్ని రాష్ట్రాల బడ్జెట్ మాత్రమేనా అని కవిత మండిపడ్డారు. కర్నాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు 5 వేల 300 కోట్లు కేటాయించినందుకు సంతోషమే కానీ కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు కేటాయింపులేవన్నారు. బడ్జెట్​లో భవిష్యత్తుపై నిర్దిష్టమైన ప్రణాళికేమీ లేదని ఆమె విమర్శించారు. కొత్త పథకాలు ప్రకటించకపోవడం.. పాత పథకాలను విస్మరించడం వంటివి చూస్తుంటే ఏడాది తర్వాత ఈ ప్రభుత్వం వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వృద్ధిని నిర్ధేశించని బడ్జెట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కేంద్ర బడ్జెట్​ను మోదీ అంకెల గారడీగా కవిత అభివర్ణించారు.

'మోదీ ప్రభుత్వ వైఫల్యాలకు బడ్జెట్‌ గణాంకాలే నిదర్శనం. సబ్ కా సాత్ అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులను సమానంగా పంపిణీ చేయడం లేదు? గతంలో మంజూరైన మెడికల్ కాలేజీల వద్దనే నర్సింగ్ కళాశాలలు పెట్టనున్నట్లు బడ్జెట్​ను చూస్తే అర్థమవుతుంది. దానివల్ల తెలంగాణకు ఒక్కటీ రాదు. గుజరాత్లోని గిఫ్ట్ సిటీకి 2025 వరకు పన్ను మినహాయింపును పొడిగించినప్పుడు... రాష్ట్రంలోని నిమ్జ్, ఇతర సెజ్​ల పరిస్థితి ఏమిటి ? కొత్త పథకాలు ప్రకటించకపోవడం, పాత పథకాలను విస్మరించడం వంటివి చూస్తుంటే ఏడాది తర్వాత ఈ ప్రభుత్వం వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది.'- కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ

అవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే మంజూరు చేస్తారు : కరోనా సమయంలో ఎంఎస్ఎంఈలకు రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఒక లక్ష కోట్లు కూడా విడుదల చేయలేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్టుల వంటి ప్రాజెక్టులు ప్రకటించినప్పటికీ.. అవన్నీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు, బీజేపీ పాలిత రాష్ట్రాలకే మంజూరు చేస్తారని కవిత ఆరోపించారు. నిజామాబాద్, వరంగల్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు భూమి అందుబాటులో ఉందని గత 9 ఏళ్లుగా కోరుతున్నా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. ఏయే రాష్ట్రాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తారో జాబితాను విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాలకు 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామన్న కేంద్రం... కేవలం వారి కార్పొరేట్ మిత్రులకే వెళ్తాయా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మోదీ ప్రభుత్వ వైఫల్యాలకు బడ్జెట్‌ గణాంకాలే నిదర్శనం : ఎమ్మెల్సీ కవిత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.