BRS Mini Plenary Meeting across Telangana : రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో జనంలోకి వెళ్లిన బీఆర్ఎస్.. ఊరూరా జెండా పండుగలు నిర్వహిస్తోంది. ఈనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సభ పేరుతో మినీ ప్లీనరీలు నేతలు చేపట్టింది. సిరిసిల్ల నియోజకవర్గ ప్రతినిధుల సభలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా తెలంగాణ తీసుకువచ్చిన ధీరోదాత్తుడు కేసీఆర్ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి: పాలకుర్తిలో జరిగిన ప్రతినిధుల సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దిశానిర్దేశలో దేశంలోనే అభివద్ధిలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను అందిస్తూ ఎనిమిదేండ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ జెండా ఎగర వేశారు. ఖమ్మంలో జరిగిన సభలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, రవిచంద్ర ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
"9 సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా రూపొందించారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆర్థికంగా బలపడేందుకు మంచి అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణలో తాగు నీటి సమస్య లేదు, రైతులకు విద్యుత్ సమస్య లేదు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఈ రోజు ఎలా ఉండేదో ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం వల్లే ప్రతి వర్గం ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది. 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుగుతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు" - ఇంద్రకరణ్ రెడ్డి, న్యాయ శాఖ మంత్రి
ఇవీ చదవండి: