BRS Leaders Reaction on Rythubandhu Funds Release Revoke : యాసంగి పంటకు రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రైతుబంధు ఇచ్చేందుకు 3 రోజుల క్రితం ఈసీ అనుమతి ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన.. హస్తం పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధును ఆపిందని చెప్పారు. ఈ క్రమంలోనే రైతుబంధు మీద కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో ఆయన రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసి, వచ్చే రైతుబంధును ఆపారన్న హరీశ్‌రావు.. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు ఖతం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే.. వృద్ధాప్య పింఛన్ రూ.5 వేలకు పెంచుతామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌ను రూ.1000కి పెంచిందన్న ఆయన.. భారత్ రాష్ట్ర సమితి మళ్లీ గెలిస్తే రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు. మూడోసారి అధికారంలోకి రాగానే రేషన్‌కార్డుపై సన్న బియ్యం ఇస్తామని.. పెండింగ్ ఉన్న ఒకట్రెండు హామీలను మళ్లీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
'నియమాలు ఉల్లంఘించారు' - రైతుబంధుకు సీఈసీ అనుమతి ఉపసంహణ
"యాసంగి పంటకు రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. రైతుబంధు ఇచ్చేందుకు 3 రోజుల క్రితం ఈసీ అనుమతి ఇచ్చింది. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో రైతుబంధును ఈసీ మళ్లీ ఆపింది. రైతుబంధు మీద కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి. కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసి వచ్చే రైతుబంధును ఆపారు." - మంత్రి హరీశ్‌రావు
రైతుబంధు కావాలా..? రాబంధులు కావాలా..? 'చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్. ఈ దేశంలో రైతుబంధును పరిచయం చేసిందే కేసీఆర్. 1956లో మన ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రతో కలిపారు. ఆనాడు కాంగ్రెస్ చేసిన తప్పునకు 50 ఏళ్లు బాధపడ్డాం. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది.. కరెంట్ పోయింది. రైతుబంధు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా..? రాబంధులు కావాలా?' అని జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ప్రశ్నించారు.
రైతుల నోటికాడి ముద్దను కాంగ్రెస్ లాగేసింది..: రైతుబంధు చెల్లింపులపై వెంటపడి ఫిర్యాదులు చేసి, కాంగ్రెస్ మరోసారి రైతు వ్యతిరేకతను చాటుకుందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. అన్నదాతల నోటికాడి ముద్దను లాగేసిన కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలని ఆమె కోరారు. రైతుబంధు చెల్లింపుల అనుమతిని ఈసీ ఉపసంహరించుకోవటంపై కవిత ఈ మేరకు స్పందించారు. కాంగ్రెస్ నేతల తీరు కారణంగానే.. రుణమాఫీ సైతం పూర్తి స్థాయిలో జరగలేదని ఆమె ఆరోపించారు.
"కాంగ్రెస్ నేతలు వెంటపడి రైతుబంధు ఆపివేయించారు. కాంగ్రెస్ నాయకులు మరోసారి రైతు వ్యతిరేకతను చాటుకున్నారు. అన్నదాతల నోటికాడి ముద్దను కాంగ్రెస్ నేతలు లాగేశారు. కాంగ్రెస్ నేతల తీరుతోనే రుణమాఫీ పూర్తి కాలేదు." - ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అర్హులైన మహిళలందరికి పింఛన్లు : కవిత
'మంగళవారం రైతుబంధు డబ్బులు పడి రైతుల ఫోన్లు టంగుటంగుమని మోగుతాయి'