ETV Bharat / state

కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది : గండ్ర - గండ్ర వెంకటరమణారెడ్డిపై భూకబ్జాకేసు

BRS Ex MLA Gandra Venkataramana Reddy on Land Kabza Case : కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని భూపాలపల్లి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలను అక్రమ కేసులు, దాడులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భూపాలపల్లిలో ఆలయం నిర్మిస్తే ఒక రౌడీషీటర్‌తో ప్రైవేట్ ఫిర్యాదు ఇప్పించి తనపై, తన కుటుంబసభ్యులపై కేసులు నమోదు చేయించారని పేర్కొన్నారు.

Land Kabza Case on BRS Leaders
BRS Ex MLA Gandra Venkataramana Reddy on Land Kabza Case
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2024, 5:57 PM IST

BRS Ex MLA Gandra Venkataramana Reddy on Land Kabza Case : అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ గుర్తుంచుకోవాలని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. తన నమోదైన భుకబ్జా కేసుపై స్పందించారు. భూపాలపల్లిలో ఆలయం నిర్మిస్తే ఒక రౌడీషీటర్‌తో ప్రైవేట్ ఫిర్యాదు ఇప్పించి సాక్షాత్తు తనపై, కుటుంబసభ్యులపై కేసులు నమోదు చేయించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌(BRS) నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

'కాంగ్రెస్ - బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించండి'

ఆలయం కడితే స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో నోటీసులు ఇచ్చారని, హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నట్లు గండ్ర వివరించారు. గుడిని ఆనుకునే ఆలయ అవసరాల కోసం కాంప్లెక్స్ కట్టామన్న అయన, అది ఆలయం ఆస్తి తప్ప నా సొంత ఆస్తి కాదని చెప్పారు. ప్రభుత్వ భూమిలో గుడి కట్టామని, ఆలయ అవసరాల కోసం కాంప్లెక్స్ కట్టినట్లు చెప్పారు. రామాలయం కట్టిన భక్త రామదాసుకే కష్టాలు తప్పలేదన్న గండ్ర, కేసు నమోదు చేశారని, జైలుకు పంపితే వెళ్తానని అన్నారు.

Land Kabza Case on BRS Leaders : పోలీసులు నిబంధనలకు లోబడి పని చేయాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏది చెబితే అది చేయడం సబబు కాదని సూచించారు. అధికారం శాశ్వతం కాదు అన్న విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ(Congress) గుర్తుంచుకోవాలని అన్నారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హామీల అమలును రాష్ట్ర కాలయాపన చేస్తున్నారని ఆరోపించిన గండ్ర, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని అన్నారు.

"కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. భూపాలపల్లిలో ఆలయం నిర్మిస్తే ఒక రౌడీషీటర్‌తో ప్రైవేట్ ఫిర్యాదు ఇప్పించి సాక్షాత్తూ నాపై, నా కుటుంబసభ్యులపై కేసు నమోదు చేయించారు. గుడిని ఆనుకునే ఆలయ అవసరాల కోసం కాంప్లెక్స్ కట్టాము. అది ఆలయం ఆస్తి తప్ప నా సొంత ఆస్తి కాదు". - గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత

అసలెేం జరిగిందంటే.. చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టారని భూపాలపల్లి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి(Gandra Venkataramana Reddy), వరంగల్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి సహా ఏడుగురిపై బుధవారం కేసు నమోదైంది. భూపాలపల్లి మండలం పూల్లురిరామయ్యపల్లి శివారులో ఉన్న చెరువు శిఖం భూమిలో మాజీ ఎమ్మెల్యే నిర్మాణం చేపట్టారని స్థానికుడు రాజలింగమూర్తి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి, జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఆదేశాలతో గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, గండ్ర గౌతంరెడ్డి, మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ వెంకటరాణి, సెగ్గం సిద్ధు, కొత్త హరిబాబు, గండ్ర హరీశ్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక సీఐ రాంనర్సింహారెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది గండ్ర వెంకటరమణారెడ్డి

'మాజీ సైనికుడు హత్యకు గురైతే పట్టించుకోకుండా - పరామర్శించిన వారిపైనే అనవసర వ్యాఖ్యలా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.