BRS Election Campaign in Telangana : రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయమే ధ్యేయంగా అధికార బీఆర్ఎస్ దూసుకుపోతుంది. విపక్షాలని విమర్శిస్తూ తమదైన శైలిలో నేతలు ఇంటింటి ప్రచారాలు చేపడుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. టీవీ ప్రకటనల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కాంగ్రెస్ ఉల్లంఘించిందని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమ భరత్ ఆక్షేపించారు. తమ ఫిర్యాదుతో కాంగ్రెస్ పార్టీపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసిందని వివరించారు.
అచ్చంపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్- ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలు
BRS MLA Candidates Election Campaign 2023 : బాలాజీనగర్ డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో అసోసియేషన్ సభ్యులతో.. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆత్మీయసమ్మేళనాలు నిర్వహించారు. శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీని గెలిపించాలంటూ కార్యకర్తలు.. ఓ హోటల్‌లో బోండాలు వేస్తూ ఇస్త్రీచేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల్లో గెలిపిస్తే అసెంబ్లీలో మీ గొంతునై ప్రశ్నిస్తానని వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో ఎన్నికల ప్రచారంలో గొంగిడి సునీతకు చుక్కెదురైంది. పథకాలు అందలేదంటూ.. మైలారం గ్రామంలో ప్రజలు నిలదీశారు. పాలిచ్చే బర్రెకు గడ్డి వేస్తే పాలు ఎక్కువగా ఇస్తుందని.. కానీ కాంగ్రెస్ పార్టీతో ఏం లాభమంటూ కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జోరందుకున్న ప్రచారాలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లడుగుతున్న నేతలు
వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలో ఆరూరి రమేష్ గ్రామంలో బజ్జీలు చేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. ఆరు గ్రామాలకు చెందిన పలువురు కార్యకర్తలు, ముఖ్యనేతలు బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలు.. బీఆర్ఎస్కు వేస్తే సంక్షేమ పథకాలు వస్తాయని విద్యుత్ శాఖమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికలు ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికలన్న ఆయన.. కులం మతం పేరు మీద ఓట్లకోసం వస్తున్నవారికి బుద్ధి చెప్పాలని సూచించారు.
Telangana Assembly Elections 2023 : పోడు భూములకు పట్టాలిచ్చిన మీబిడ్డను.. మళ్లీ ఆశీర్వదించాలని నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి అభ్యర్థించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో రెండో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొనఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం జీవిస్తానని, ప్రజలు గమనించి ప్రజల్లో ఉండే నాయకుడికి ఓటు వేసి గెలిపించాలని సంగారెడ్డి అభ్యర్థి చింతాప్రభాకర్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో కేసీఆర్ సర్కారుతో పోటీపడే దమ్ము రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు.సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హ్యాట్రిక్ విజయం కాయమని ధీమా వ్యక్తంచేశారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థి సునీత రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి అభివృద్ధిని వివరిస్తూ నర్సాపూర్ ఇంటిటికీ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నారని చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చిర్రకుంట, సారంగపల్లి శంకర్ పల్లి, ఆదిల్ పేటలో ప్రచారం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కామేపల్లి మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి విస్తృతంగా జనంలోకి వెళ్లారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జోరందుకున్న ప్రచారాలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లడుగుతున్న నేతలు
తెలంగాణలో 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరే