BRS Congress Debate on SC ST Declaration : ఇటీవల చేవెళ్ల ప్రజాగర్జన సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెెస్లు ఈ అంశంపై పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్(KTR) ట్విటర్ వేదికగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా కేటీఆర్.. విమర్శలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) తిప్పికొట్టారు.
-
అది డిక్లరేషన్ సభ కాదు...
— KTR (@KTRBRS) August 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
అధికారం రానే రాదనే...
కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ
కర్ణాటకలో కనీసం రేషన్.. ఇవ్వలేని కాంగ్రెస్
తెలంగాణకొచ్చి డిక్లరేషన్.. ఇస్తే నమ్మేదెవరు ?
గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు
మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిది
చైతన్యానికి ప్రతీకైన
తెలంగాణ ప్రజలకు…
">అది డిక్లరేషన్ సభ కాదు...
— KTR (@KTRBRS) August 27, 2023
అధికారం రానే రాదనే...
కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ
కర్ణాటకలో కనీసం రేషన్.. ఇవ్వలేని కాంగ్రెస్
తెలంగాణకొచ్చి డిక్లరేషన్.. ఇస్తే నమ్మేదెవరు ?
గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు
మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిది
చైతన్యానికి ప్రతీకైన
తెలంగాణ ప్రజలకు…అది డిక్లరేషన్ సభ కాదు...
— KTR (@KTRBRS) August 27, 2023
అధికారం రానే రాదనే...
కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ
కర్ణాటకలో కనీసం రేషన్.. ఇవ్వలేని కాంగ్రెస్
తెలంగాణకొచ్చి డిక్లరేషన్.. ఇస్తే నమ్మేదెవరు ?
గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు
మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిది
చైతన్యానికి ప్రతీకైన
తెలంగాణ ప్రజలకు…
KTR on Congress SC ST Declaration : కాంగ్రెస్‌ది డిక్లరేషన్ సభ కాదు.. అధికారం రానే రాదనే ఫ్రస్ట్రేషన్ సభగా కేటీఆర్ అభివర్ణించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైనా ఎస్సీ, ఎస్టీలు వెనకబడి ఉన్నారంటే ప్రధాన కారణం కాంగ్రెస్సేనని కేటీఆర్ విమర్శించారు. దళిత, గిరిజన బిడ్డలకు కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపమే.. ఆ పార్టీని మరో వందేళ్లయినా శాపంలా వెంటాడుతూనే ఉంటుందని ధ్వజమెత్తారు. కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి.. పాలించే ఎబిలిటీ లేదని, ప్రజల్లో క్రెడిబిలిటీ లేదని దుయ్యబట్టారు.
KTR Tweet on Congress SC ST Declaration కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్.. ఇక్కడికొచ్చి డిక్లరేషన్ ఇస్తే ఎవరు నమ్ముతారని కేటీఆర్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట.విజన్ లేని కాంగ్రెస్ డజన్ హామీలు గాలీలోని దీపాలని చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే.. దేశానికే ఓ పరిపాలనా పాఠంగా నిలిచిందని తెలిపారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని పార్టీ కాంగ్రెస్ అయితే.. ఇవ్వని హామీలెన్నో అమలు చేసిన ప్రభుత్వం తమదంటూ ట్వీట్ చేశారు.
-
మా డిక్లరేషన్ దళిత - గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్.
— Revanth Reddy (@revanth_anumula) August 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
1. మా డిక్లరేషన్ … దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదు.
2. మా డిక్లరేషన్… ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదు.
3. మా డిక్లరేషన్… గిరిజన రిజర్వేషన్లు 12… https://t.co/oxzAFlzOLQ
">మా డిక్లరేషన్ దళిత - గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్.
— Revanth Reddy (@revanth_anumula) August 28, 2023
1. మా డిక్లరేషన్ … దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదు.
2. మా డిక్లరేషన్… ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదు.
3. మా డిక్లరేషన్… గిరిజన రిజర్వేషన్లు 12… https://t.co/oxzAFlzOLQమా డిక్లరేషన్ దళిత - గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్.
— Revanth Reddy (@revanth_anumula) August 28, 2023
1. మా డిక్లరేషన్ … దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదు.
2. మా డిక్లరేషన్… ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదు.
3. మా డిక్లరేషన్… గిరిజన రిజర్వేషన్లు 12… https://t.co/oxzAFlzOLQ
Revanth Reddy Counter to KTR on Twitter : కేటీఆర్ విమర్శలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా ఎదురుదాడి చేశారు. తమ డిక్లరేషన్ దళిత - గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్‌గా ఆయన పేర్కొన్నారు. దళితుడ్ని సీఎం చేస్తానని, మూడెకరాల భూమిస్తానని మోసం చేయడం లాంటిది కాంగ్రెస్ డిక్లరేషన్ కాదన్నారు. 12 శాతం గిరిజన రిజర్వేషన్లు, మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు, నేరెళ్ల ఘటనలాంటివి కాంగ్రెస్ డిక్లరేషన్ కాదని చెప్పారు.
దళిత – గిరిజనులకు కాంగ్రెస్ పంచిన భూములను రియల్ మాఫియాకు అమ్ముకోవటం, ఎస్సీ మహిళ మరియమ్మను లాకప్ డెత్, ఎస్సీలకు మంత్రి పదవి లేకపోవటం, ఏబీసీడీ వర్గీకరణ లేకపోవటం, దళిత బంధు(Dalit Bandhu)లో కమీషన్ల లాంటివి కాంగ్రెస్ డిక్లరేషన్ కాదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే “కేసీఆర్ ఖేల్ ఖతం - బీఆర్ఎస్ దుఖాన్ బంద్” జై కాంగ్రెస్.. అంటూ రీట్వీట్ చేశారు.
MLC Kavtha on Congress SC ST Declaration : కాంగ్రెస్ విడుదల చేసిన దళిత డిక్లరేషన్ ఒక బూటకం అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమైన కవిత.. ఎస్సీల మీద కాంగ్రెస్ ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తోందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ.. ఎన్నో ఏళ్లుగా ఎస్సీలను పేదరికంలోనే ఉంచిందని, బీఆర్ఎస్ చేస్తున్న పనులనే కాంగ్రెస్ కాపీ కొడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చెప్పింది చేయలేదని.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీకి రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థులే లేరన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని స్పష్టం చేశారు.