ETV Bharat / state

ప్రచారాలతో హెరెత్తిస్తున్న బీఆర్​ఎస్ - ఊరూరా రోడ్​ షోలు, బహిరంగ సభలతో విస్తృతంగా ప్రజల్లోకి గులాబీ దళం - కేసీఆర్ ఎన్నికల ప్రచారం

BRS Campaign in Telangana 2023 : ఎన్నికల గడువు రెండురోజులే ఉండటంతో విజయమే లక్ష్యంగా అధికార బీఆర్ఎస్‌ ప్రచారాలతో హోరెత్తిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశంతో.. పార్టీ నేతలు, అభ్యర్థులు బహిరంగ సభలు, ఊరూరా ప్రచారాలతో గులాబీ దళం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. కేటీఆర్‌, హరీశ్‌రావు రోడ్​షోలు, సభలతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

CM KCR Public Meetings
BRS Campaign in Telangana 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 9:05 AM IST

కేసీఆర్‌ దిశానిర్దేశంతో బీఆర్ఎస్ ప్రచార జోరు - మేనిఫెస్టో వివరిస్తూ ఓట్లడుగుతున్నఅభ్యర్థులు

BRS Campaign in Telangana 2023 : మూడ్రోజుల్లో ఎన్నికల ప్రచార గడువు ముగియనుండడంతో అధికార బీఆర్ఎస్ మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. గులాబీ బాస్‌ కేసీఆర్‌ దిశానిర్దేశంతో.. పార్టీ నేతలు, అభ్యర్థులు.. ప్రచార జోరు పెంచారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఓవైపు విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ.. మరోవైపు తమ సంక్షేమ పథకాలు, మేనిఫెస్టోను వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Telangana Assembly Elections Campaign 2023 : హైదరాబాద్‌ గోషామహల్‌లో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షో నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నంద్‌కిషోర్ వ్యాస్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పర్యటించారు. మల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన ఆర్ఎంపీ డాక్టర్ల సమ్మేళనానికి.. ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఎమ్మెల్యే అభ్యర్థి మహిపాల్ రెడ్డి విస్తృత ప్రచారం చేశారు.

'కాంగ్రెస్‌ మేనిఫెస్టోను నమ్మితే మోసపోతాం - అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు'

''మీకు పని చేసే ఎమ్మెల్యే కావాలా.. పంచాయితీ పెట్టే ఎమ్మెల్యే కావాలో ఆలోచించుకోండి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండి.. గోషామహల్ ఎమ్మెల్యే వేరే ఉంటే అనవసరమైన పంచాయితీలు చేస్తడు తప్ప గోషామహల్ అభివృద్దికి పనికొచ్చే వాడు కాదు. అందుకే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలి." -కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు

BRS Speed Up in Election Campaign : సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలో మంత్రి హరీశ్‌రావుకు మద్దతుగా ఆయని సతీమణి శ్రీనిత ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్​ను ఆశీర్వదించాలని కోరారు. భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డికి మద్దతుగా.. మంత్రి హరీశ్‌రావు రోడ్‌షో చేపట్టారు. 80 సీట్లతో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం.. ఆలేరు నియోజకవర్గంలో.. జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో హరీశ్‌రావు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో.. పార్టీ అభ్యర్థి సతీశ్‌కుమార్‌తో కలిసి.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపా‌ధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ప్రచారం చేశారు.

బావాబామ్మర్దిల పోటీ 'గెలుపు కోసం కాదు - మెజార్టీ కోసం'!

Telangana Assembly Elections 2023 : ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతి.. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఖమ్మం జిల్లా వైరాలో బానోత్ మదన్‌లాల్‌కు మద్దతుగా.. ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన సండ్ర వెంకటవీరయ్యకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. సర్కారు అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ.. రోడ్‌ షోలతో సండ్ర ముందుకు సాగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు.. గడపగడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఊరూరా హోరెత్తిన ప్రచారం - ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థుల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా

హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచార జోరు - గులాబీ జెండాకు మద్దతివ్వాలంటూ ఊరూవాడా ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.