BRS boycott of President budget speech: రాజ్యాంగాన్ని గౌరవించడం చేతకాని సీఎం కేసీఆర్.. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని పదే పదే అవమానపరుస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీలనే కాదు చివరకు గవర్నర్లను, ప్రధానిని, రాష్ట్రపతిని కూడా గౌరవించడం కేసీఆర్‌కు రాదని ఆరోపించారు. 'ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేసి.. ఆయన్ను సస్పెండ్ చేసిన మీరు.. మాకు నీతులు చెబుతారా' అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పార్లమెంట్లో రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేయాలంటూ బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ పిలుపునివ్వడం.. రాజ్యాంగానికి, రాజ్యాంగబద్ధ సంస్థలకు, రాజ్యాంగబద్ధ పదవులకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే గౌరవానికి నిదర్శనమని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిసారి రాజీనామాకు సిద్ధమని చెప్పే బీఆర్ఎస్ నాయకులని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. 'మీరు రాజీనామా చేయాల్సిన పని లేకుండానే రోబోయే ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని' కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.
గవర్నర్ వ్యవహారశైలిని దేశం ముందు ఉంచేందుకే ఈ నిర్ణయం: బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి. బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో చేసిన వైఫల్యాలకు నిరసనగానే తాము ఈ ప్రసంగాన్ని బహిష్కరించినట్లు బీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించారు. తెలంగాణ, దిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారాయన్న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు.. వీటిని దేశ ప్రజల ముందు పెట్టేందుకే తామీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంలో మహిళాబిల్లు, పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు, రైతులకు ఎంఎస్‌పీ వంటి అంశాలు ప్రస్తావనకు రాకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత అన్నారు.
ఇవీ చదవండి: