ETV Bharat / state

హ్యాట్రిక్‌ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచార హోరు - అభివృద్ధిని గుర్తించి దీవించాలని వేడుకుంటున్న అభ్యర్థులు - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రచారం 2023

BRS Assembly Elections Campaign 2023 : ఓవైపు నామినేషన్లు, మరోవైపు ప్రచారాలతో బీఆర్​ఎస్​ పార్టీ జోరు పెంచింది. రాష్ట్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా.. ఆ పార్టీ పావులు కదుపుతోంది. అభ్యర్థులు ప్రతిపక్షాల తప్పొప్పులను ఎత్తిచూపుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో మరోసారి దీవించాలని ప్రజలను వేడుకుంటున్నారు.

BRS MLA Candidates Election Campaign in Telangana
BRS Assembly Elections Campaign 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 9:42 AM IST

హ్యాట్రిక్‌ లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచార హోరు - అభివృద్ధిని గుర్తించి దీవించాలని వేడుకుంటున్న నేతలు

BRS Assembly Elections Campaign 2023 : ఎన్నికల్లో అధికారపార్టీ నేతలు ప్రచారంలో జోరు పెంచారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఓటు అడిగే నైతికహక్కు కేవలం బీఆర్​ఎస్​కే ఉందని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కేసీఆర్ నడిపినందువల్లే.. మరోసారి దీవించాలని ఆత్మీయ సమ్మేళనంలో కోరారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని భ్రమలో ఉన్నారనీ.. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్​డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు.

Harish Rao Election Campaign 2023 : ఎన్నికలప్పుడు అంతా వస్తారు.. ఎన్నికలు లేనప్పుడు ఎవరు వెంటఉంటారనేది ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఐదేళ్లు ప్రజలకోసం పనిచేశానని, అభివృద్ధిని చూసి తాను రాసిన పరీక్షకు ఎన్ని మార్కులు వేస్తారో వేయండని ఎన్నికలనుద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ మహిళా మోర్చా నేత బండి సుగుణ సహా పలువురిని కండువా కప్పి పార్టీలోకి హరీశ్‌రావు ఆహ్వానించారు.

BRS MLA Candidates Election Campaign in Telangana : నిజామాబాద్ జిల్లా బోధన్‌లో.. షకీల్ ఆధ్వర్యంలో గౌడ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్​ అంటే ఆత్మీయత.. కాంగ్రెస్ అంటే ఆహంకారమంటూ వ్యాఖ్యానించారు. అలాగే షకీల్​ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. బాల్కొండలో ప్రచారానికి వెళ్లిన వేముల ప్రశాంత్ రెడ్డికి మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. జక్రాన్‌పల్లి మండలంలో నిజామాబాద్‌ గ్రామీణ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రచారం ముమ్మరం చేశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌లో ప్రచారంలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. ప్రతిపక్షాలు ప్రజలను మోసం చేయడానికి కళ్లబొల్లి కబుర్లు చెబుతారని.. వాటిని విని ప్రజలు మోసపోవద్దని సూచించారు.

మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేలా బీఆర్ఎస్ ప్రణాళికలు - వినూత్న పద్దతుల్లో ప్రచారంలో దూసుకెళ్తున్న అభ్యర్థులు

Telangana Assembly Elections 2023 : నారాయణపేట జిల్లా మక్తల్‌లో ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. రాష్ట్రంలో గ్యారంటీల పేరుచెప్పే వారికే సరైన గ్యారెంటీ లేదని.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ విమర్శించారు. ములుగు జిల్లా అభ్యర్థి బడే నాగజ్యోతికి మద్దతుగా.. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రచారం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విస్తృతంగా జనంలకి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పరకాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డికి దామెర మండలంలోని పసరగొండలో నిరసన సెగ తగిలింది. దళితబంధు ఎవరికి ఇచ్చారని గ్రామస్థులు ఎమ్మెల్యేను నిలదీశారు.

ప్రచారంలో కారు టాప్ గేర్​ - మూడోసారి అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీమ్ కేసీఆర్

BRS Candidates Election Campaign Telangana 2023 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, భవిష్యత్​లో చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి వెళ్లి ఓటును అభ్యర్థించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఏడు సార్లు అవకాశం ఇచ్చారని, ఈసారి తనకు ఇవ్వాలని.. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ప్రజలను కోరారు. సతీమణి శాలినిరెడ్డితో కలిసి పాడికౌశిక్‌ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రచారం చేసిన గొంగిడి సునీత.. కేసీఆర్​ను హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రిగా చూడటమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

BRS Assembly Elections Campaign 2023 : ప్రచారంలో దూసుకెళ్తోన్న బీఆర్​ఎస్​.. 24 గంటల కరెంటే ప్రధాన ఎజెండాగా జనంలోకి

BRS Assembly Elections Campaign 2023 : హ్యాట్రిక్‌ లక్ష్యంగా గులాబీ ప్రచార హోరు.. నామినేషన్లకు ముందే విస్తృతంగా ప్రజాక్షేత్రంలోకి అభ్యర్థులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.