ETV Bharat / state

రాష్ట్రంలో కొవిడ్‌ మృతుల సంఖ్యపై అనుమానాలున్నాయి: హైకోర్టు

తమిళనాడు, కేరళ, దిల్లీ వంటి రాష్ట్రాల్లో రెండో విడత కొవిడ్‌ విజృంభిస్తుండడాన్ని మనం చూస్తున్నాం. వచ్చేది పండుగల సీజన్‌.. అందులోనూ శీతాకాలం కావడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కానీ ప్రభుత్వం తగిన ప్రయత్నాలు చేయడంలేదు. కరోనా తిరిగి విజృంభించే అవకాశాలున్నందున వైద్యఆరోగ్య శాఖను బలోపేతం చేయాలి. పైపై పూతలు కాదు.-హైకోర్టు

brief story on telangana high court dissatisfied with corona report submitted by ts government
రాష్ట్రంలో కొవిడ్‌ మృతుల సంఖ్యపై అనుమానాలున్నాయి: హైకోర్టు
author img

By

Published : Oct 13, 2020, 7:10 AM IST

ప్రభుత్వం వెల్లడిస్తున్న కొవిడ్‌ మరణాల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. పరీక్షల సంఖ్య 300 ఉన్నప్పుడు, 60,000 చేసినప్పుడు కూడా మరణాల సంఖ్య మాత్రం 10కి మించకుండా చూపుతుండటంపై అనుమానాలున్నాయంది. ప్రజలకు కరోనా తీవ్రత గురించి చెప్పకుండా చీకట్లో ఉంచుతున్నారని పేర్కొంది. పరిస్థితులకు తగ్గట్లుగా సాధారణ పడకలను పెంచాల్సి ఉండగా 367 తగ్గాయని, కేవలం 831 ఆక్సిజన్‌, 352 ఐసీయూ పడకలను పెంచడం నామమాత్రమేనని తెలిపింది. వెంటిలేటర్లు కూడా అవసరాలకు సరిపడా లేవంది.

జనాభాకు అనుగుణంగా పరీక్షల్లేవు

రాష్ట్రంలో మొత్తం 62 కొవిడ్‌ ఆస్పత్రులే ఉన్నాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువని పేర్కొంది. కొవిడ్‌పై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ధరణిలో ఆస్తుల నమోదు వంటి పథకాలకు శానిటరీ, ప్రజారోగ్య శాఖ సిబ్బందిని వినియోగిస్తున్నారని పిటిషనర్లు చెప్పడంతో వారిని ఇతర పనులకు మళ్లించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికను చాలా తెలివిగా రాశారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పదేపదే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూనే ఉన్నారని, ఇలాగైతే ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌పై ధిక్కరణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. వాస్తవాలను వెల్లడిస్తామని ప్రధాన కార్యదర్శి చెప్పడంతో హాజరు నుంచి మినహాయింపునిచ్చామని, ఇలాగైతే మళ్లీ పిలిపించాల్సి ఉంటుందని పేర్కొంది. గత ఆదేశాల్లో పరీక్షల సంఖ్యను ఎందుకు తగ్గిస్తున్నారో చెప్పమన్నా, తెలివిగా సగటు తగ్గలేదని పేర్కొన్నారంటూ అసంతృప్తి వ్యక్తంచేసింది. పరీక్షలు ఉన్నట్లుండి 62 వేల నుంచి 30 వేలకు పడిపోతున్నాయని, కారణమడిగితే.. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు సెలవులు కావడంతో తగ్గాయంటున్నారని పేర్కొంది. సాధారణంగా సెలవు రోజుల్లోనే ప్రజలు బయటకు ఎక్కువగా వెళ్తుంటారని, పరీక్షలకు రావడంలేదనడం సరికాదంది. బతుకమ్మ, దసరా, దీపావళి సందర్భంగా ప్రజలు ఎక్కువ గుమికూడతారని, రెండోసారి దీని ప్రభావం ఉంటుందని శ్రీనివాస్‌రావు అంగీకరించినా ఆశ్చర్యకరంగా అందుకు తగిన ఏర్పాట్లు మాత్రం జరగలేదంది.

అవసరాలకు తగినంతగా ఏర్పాట్లు లేవు

ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల నిమిత్తం ప్రభుత్వానికి చెందినవి 17 ల్యాబ్‌లు, ప్రైవేటువి 44 ఉన్నాయని, మరో 6 ల్యాబ్‌లను ‘త్వరలో’ ఏర్పాటు చేయబోతున్నామని ప్రభుత్వం చెప్పిందని, ‘త్వరలో’ అంటే వారాలా, నెలలా, సంవత్సరాలా అని ప్రశ్నించింది. కొవిడ్‌ తీవ్రమవుతున్న నేపథ్యంలో 3.7 కోట్ల మందికి 23 ల్యాబ్‌లు సరిపోవంది. 10 శాతం మాత్రమే పరీక్షలు జరిగాయని, వాటి సంఖ్య పెంచాలంది. ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యాన్ని చూపే లైవ్‌ డ్యాష్‌ బోర్డులను ఏర్పాటు చేయాలని చెబితే.. వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయంటున్నారని, సామాన్యులకు వెబ్‌సైట్‌లో చూడటం ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. డిస్‌ప్లే బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇళ్లులేని అభాగ్యులు, నిరాశ్రయులకు పరీక్షలు నిర్వహించడానికి 10 మొబైల్‌ వ్యాన్‌లున్నా వాటిలో కేవలం 42,476 పరీక్షలే నిర్వహించారంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం పడకలు లేవని ఎత్తిచూపింది. రాష్ట్రంలో అంబులెన్స్‌ల 350 ఉండగా, 169 కొంటామని చెప్పి 30 మాత్రమే కొన్నారని, పల్లెలకూ కొవిడ్‌ వ్యాపించినందున వీటి అవసరం ఉందని పేర్కొంది.

ప్రైవేటు ఆస్పత్రులపై చర్యల్లేవు

ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఛార్జీలను వసూలు చేస్తూనే ఉన్నా చర్యలపై నివేదిక సమర్పించకపోవడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ ఫీజులపై జాతీయ ఫార్మాసూటికల్‌ అథారిటీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా విపత్తుల నిర్వహణ ప్రణాళికను సమర్పించాలని, కమ్యూనిటీ హాళ్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. పూర్తి వివరాలతో నివేదికను నవంబరు 16లోగా సమర్పించాలంటూ విచారణను అదేనెల 19కి వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.