ఇంజినీరింగ్లో కన్వీనర్ కోటాలో ఈ ఏడాది 66,290 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరో 6,629 సీట్లను ఈడబ్ల్యూఎస్ కోటాలో కన్వీనర్ ద్వారా భర్తీ చేయనున్నారు. అంటే మొత్తం 72,819 సీట్లు కన్వీనర్ ద్వారా భర్తీ కానున్నాయి. విద్యార్థుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్న సీఎస్ఈలోనే అత్యధిక సీట్లు ఉన్నాయి. గతేడాది నుంచి పలు కాలేజీలు మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సంప్రదాయ కోర్సుల్లో సీట్లను వెనక్కి ఇచ్చి.. ఐటీ కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి.
గతేడాదితో కొత్తగా కోర్సులు రాకపోయినప్పటికీ.. డిమాండ్ ఉన్న కోర్సుల్లో కొన్ని పెరిగాయి. ఫార్మా కోర్సుల్లో ఎంపీసీ, బైపీసీ అభ్యర్థులకు చెరి సగం కేటాయించారు. ఎంపీసీ అభ్యర్థులకు బీఫార్మసీలో 3,220, ఫార్మ్డీలో 520 ఉన్నాయి. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కోసం వెబ్ ఆప్షన్ల నమోదు ఈనెల 16తో ముగియనుంది. ఇవాళ్టి వరకు 47,471 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు.
కోర్సుల వారీగా వివిధ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వీటిని కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 10శాతం సీట్లు అదనంగా ఉంటాయి.
కోర్సుల వివరాలు | సీట్లు |
సీఎస్ఈ | 16,801 |
ఈసీఈ | 12,582 |
సీఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్, మెషీన్ లెర్నింగ్ | 5,037 |
డేటాసైన్స్ | 3,003 |
సైబర్ సెక్యూరిటీ | 1,638 |
ఐఓటీ | 1,029 |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | 4,713 |
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సు | 420 |
ట్రిపుల్ఈ (EEE) | 6,366 |
సివిల్ | 5,766 |
మెకానికల్ | 5,355 |
ఇదీ చూడండి: LAWCET RESULTS: నేడు లా సెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు విడుదల