సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ పట్టణ పరిధిలోని భవాని నగర్లో అరుదైన బ్రహ్మకమలం పుష్పాలు కనువిందు చేస్తున్నాయి.. జీహెచ్ఎంసీ అల్వాల్ సర్కిల్ లైజనింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న నరేందర్ రెడ్డి, వాణి దంపతుల ఇంట్లో ఈ అరుదైన పుష్పం వీరబూసింది. తన తమ్ముడి కుమారుడు హిమాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ కనిపించే బ్రహ్మకమలం మొక్కల ఆకులను తనకు ఇచ్చినట్టు, వాటిని పవిత్రంగా భావించి.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని పెంచినట్లు నరేందర్ రెడ్డి తెలిపారు.
శివపార్వతులకు ఎంతో ఇష్టమైన బ్రహ్మకమలం పుష్పాలు తమ ఇంట్లో పెరగడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని వారు తెలిపారు. మూడు సంవత్సరాలుగా.. జాగ్రత్తగా కాపాడుతూ.. పెంచగా.. ప్రస్తుతం ఐదు పుష్పాలు పూసాయి. ఈ పుష్పాలు ఏడాదిలో కేవలం కార్తీకమాసంలో వికసిస్తాయి అని వాటిని శివపార్వతుల పూజ కోసం వాడుతామని తెలిపారు.
ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్