హైదరాబాద్ నగర శివారు పహాడి షరీఫ్‌లోని ముస్తఫా కాలనీలో ఏడేళ్ల బాలుడి హత్య కలకలం రేపింది. ఏడాది క్రితం నగరానికి వచ్చిన భాషా కుమారుడు మహ్మద్ యాసిన్ రాత్రి శీతలపానీయం ప్రూటి కోసం బయకు వెళ్లి చాలాసేపటి వరకు రాలేదు. కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా పొదల్లోకి ఎవరో తీసుకెళ్తున్నారని స్థానికులు చెప్పారు. వెంటనే పొదల వైపు పరుగెడుతుండగానే... బాబును అక్కడే వదిలివేసి గుర్తు తెలియని వ్యక్తి పరారయ్యాడు. అప్పటికే బాబు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని తెలిపారు. ఎవరో బాలుడి తలపై బాది హత్యచేసినట్లు వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
హైదరాబాద్‌లో ఏడేళ్ల బాలుడి హత్య
హైదరాబాద్ నగర శివారు పహాడి షరీఫ్‌లోని ముస్తఫా కాలనీలో రాత్రి దారుణం జరిగింది. ఏడేళ్ల బాలుడి హత్య ఘటన కలకలం రేపింది.