ఇంటి పై కప్పు కూలి బాలుడు చనిపోయిన ఘటన చిలకలగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో బాలుడి తల్లికి తీవ్ర గాయాలు అవడంతో ఆమెను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. పురాతన ఇల్లు కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా మట్టి కుప్పలు బాలుడిపై పడడం వల్ల అక్కడికక్కడే మరణించాడని బాలుడి బాబాయ్ తెలిపారు. ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు చెప్పారు.
సంఘటనా స్థలాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, స్థానిక కార్పొరేటర్ హేమ పరిశీలించారు. పాత భవనాలకు నోటీసులు ఇచ్చినప్పటికీ ప్రజలు కోర్టుకు వెళ్లి... వాటిలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారని రవికుమార్ అన్నారు. బాలుడి చనిపోయిన ఇంటికి మరొక ఇల్లు అనుకొని ఉండడం వల్లనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. చనిపోయిన బాలుడికి నష్టపరిహారం చెల్లించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పురాతన భవనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... వీలైనంత త్వరగా వాటిని ఖాళీ చేయాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు.
ఇవీ చూడండి:దేశానికే ఆదర్శం... ఈ రెండు గ్రామాలు