ETV Bharat / state

Bosch in Hyderabad: హైదరాబాద్​కు బాష్.. మూడువేల మందికి ఉపాధి.. - Hyderabad bosch

Bosch in Hyderabad: హైదరాబాద్​కు మరో ఇంటర్నేషనల్ కంపెనీ రాబోతోంది. పలు రంగాల్లో అగ్రగామిగా ఉన్న బాష్ సంస్థ భాగ్యనగరానికి విచ్చేస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Bosch
Bosch
author img

By

Published : Feb 8, 2022, 7:45 PM IST

Bosch in Hyderabad: హైదరాబాద్​కు మరో అంతర్జాతీయ సంస్థ బాష్ (Bosch) రాబోతుంది. మొబిలిటీ, ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్, గృహోపకరణాలలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న బాష్ సంస్థ... తమ బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ కోసం హైదరాబాద్​ను ఎంచుకుందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. బాష్ సంస్థ రాకతో... సుమారు 3,000ల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

  • BOSCH in Hyderabad! 😊

    German MNC & a world leader in Mobility, Industrial Engineering & Home Appliances has chosen Hyderabad as a strategic location with its Bosch Global Software Technologies and R&D presence. The proposed facility will provide employment to about 3000 people pic.twitter.com/vqAWo2SUPd

    — KTR (@KTRTRS) February 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందడంలేదని కేటీఆర్​ ఇటీవల పదేపదే చెబుతూ వస్తున్నారు. ఇటీవల ట్విట్టర్​లో కేంద్రమంత్రి కిషన్​రెడ్డికి, ఆయనకు మాటల యుద్ధం నడిచింది. కేంద్రం సహాయం చేయకపోయినా తాము ముందుకెళ్తున్నామని కేటీఆర్ అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయకపోయినా... మేధ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నామని కేటీఆర్​ కౌంటర్ ఇచ్చారు. ఇటీవలే మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

Ktr on Medha Rail Coach Factory: భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీలలో ఒకటైన మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ప్రారంభం కానుండడం గర్వకారణంగా ఉందని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. రెండేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా కొడంకల్‌లో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. భూమిపూజ చేసిన దగ్గరి నుంచి నిర్మాణ పనులను మేధా సంస్థ వేగంగా పూర్తిచేసుకుంది. త్వరలోనే ప్రారంభంకానుందని వివరించారు.

ఇదీ చూడండి: Ktr on Medha Rail Coach Factory: 'మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకే తలమానికం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.