Bura Narasayya comments on KCR : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ ఎంపీ భాజపా నేత బూర నర్సయ్య గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలదన్నట్లు దేశ ప్రజలను మోసం చేయడానికి వెళ్లారని మండిపడ్డారు. భారాస పార్టీ ఆవిర్భావం రోజు కేసీఆర్ ముఖంలో గాంభీర్యం కాకుండా గాబరా కనిపించిందని ఎద్దేవా చేశారు. ఆ రోజున కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని చూస్తే బాధనిపించదన్నారు. కర్ణాటక ప్రజలు కుమారస్వామి ,కేసీఆర్‌కు గులాంలా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో దిల్లీకి సూటుకేసులు ఇప్పుడేమో కంటైనర్లు వెళ్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ తల్లిని మోసం చేశారని విమర్శించారు. మూడు ముక్కల్లో చెప్పాలంటే కేసీఆర్ తెలంగాణ మోడల్ అప్పు,సిప్పు, డప్పులా చేశారని ఘాటు విమర్శలు చేశారు.కేసీఆర్ ది ఆప్ కి భార్ కిసాన్ సర్కార్ కాదని...ఆప్ కి భార్ బ్రస్టాచార్ సర్కార్‌గా పేర్కొన్నారు. కేసీఆర్ పూజలు,యాగాలు భక్తిలేని శివ పూజలాంటిదని ఎద్దేవా చేశారు. ఐదు సంవత్సరాల్లో ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపింది దేశంలో కేసీఆర్ ఒక్కరే అని విమర్శించారు.
ఇవీ చదవండి :