ETV Bharat / state

స్నేహితుడి ఖాతా నుంచి బాంబు బెదిరింపు మెయిల్​ - prakash reddy

స్నేహితుడు అంటే మన కోసం తపించేవాడు.. బాధను పంచుకునేవాడు... కానీ ఓ వ్యక్తి మాత్రం తన స్నేహితుడు విదేశాలకు వెళ్తున్నాడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు.​ విదేశాలకు వెళ్లకుండా ఆపాలని పన్నాగం పన్నాడు. ఏకంగా శంషాబాద్​ విమానాశ్రయానికే బాంబు బెదిరింపు మెయిల్​ చేసి చివరకు పోలీసులకు దొరికిపోయాడు.

డీసీపీ ప్రకాశ్​ రెడ్డి
author img

By

Published : Sep 4, 2019, 9:02 PM IST

Updated : Sep 4, 2019, 9:24 PM IST

సాయిరాం, శశికాంత్​ ఇద్దరు మంచి స్నేహితులు సాయిరాం కెనడా వెళ్లేందుకు వీసా వచ్చింది. కానీ శశికాంత్​కు రాలేదు. జీర్ణించుకోలేని శశి మంగళవారం సాయిరాం మెయిల్​ ఐడీతో శంషాబాద్​ విమానాశ్రయానికి బాంబు ఉందని బెదిరింపు మెయిల్ పంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మెయిల్​ ఐడీ ద్వారా సాయిరాంను విచారించి శశికాంత్​ను నిందితుడిగా గుర్తించామని శంషాబాద్​ డీసీపీ ప్రకాశ్​ రెడ్డి తెలిపారు. అమీర్​పేట్​లోని ఓ హాస్టల్లో ఉన్న శశికాంత్​ను అదుపులోకి తీసుకుని అతని నుంచి ల్యాప్​ టాప్​, రూటర్​ను స్వాధీనం చేసుకున్నామన్నారు.

స్నేహితుడి ఖాతా నుంచి బాంబు బెదిరింపు మెయిల్​

ఇదీ చూడండి: లండన్ నుంచి వచ్చాడు... అదృశ్యమయ్యాడు

TG_Hyd_65_04_DCP_On_Airport_Issues_AB_TS10020 Contributor: Bhujanga Reddy Script: Razaq Note: ఫీడ్ ఈటీవీ భారత్ మోజో కిట్‌ ద్వారా వచ్చాయి. ( ) శంషాబాద్ విమానాశ్రయాన్ని పేల్చివేస్తామంటూ మెయిల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. తన మిత్రుడు కెనడా దేశానికి వెళ్లకుండా అడ్డుకునేందుకే శశికాంత్ అనే యువకుడు నకిలీ మెయిల్ పంపినట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు. సాయిరాం, శశికాంత్‌ మిత్రులని...గత కొన్ని రోజులుగా కెనడాకు వెళ్లేందుకు సాయిరాం ప్రయత్నాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. అయితే సాయిరాం కెనడాకు వెళ్లకుండా శశికాంత్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ నెల 4న ( ఇవాళ ) శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా కెనడాకు వెళ్లాల్సి ఉంది. అతను ఆ దేశానికి వెళ్లకుండా శశికాంత్ మెయిల్ ఐడీ పేరుతో ఎయిర్‌ పోర్టును పేలుస్తామంటూ ఎయిర్ పోర్టు జీఎంఆర్‌ అధికారులకు మెయిల్ చేశాడు. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు సూత్రదారి శశికాంత్‌గా గుర్తించి అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. వీసా అప్లికేషన్ కోసం శశికాంత్ తన ఇంట్లో కంప్యూటర్‌లో దరఖాస్తు చేస్తుండగా రహస్యంగా సాయిరాం వివరాలు సేకరించినట్లు డీసీపీ పేర్కొన్నారు. దీనిపై కూడా సాయిరాం రాచకొండ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బైట్: ప్రకాష్ రెడ్డి, శంషాబాద్ డీసీపీ
Last Updated : Sep 4, 2019, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.