ETV Bharat / state

రైలులో ప్రయాణికుల మధ్య గొడవ.. రెండు గంటలు నిలుపుదల.. అసలేం జరిగింది? - టికెట్

Bokaro Express Train stopped in Regupalem: రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు, జనరల్ టికెట్ మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులు మధ్య ఏర్పడ్డ వివాదం కారణంగా బొకారో ఎక్స్​ప్రెస్​ రెండు గంటల పాటు నిలిచిపోయింది. ఈ ఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం రైల్వే స్టేషన్​లో జరిగింది.

Bokaro Express Train stopped in Regupalem
బొకారో ఎక్స్​ప్రెస్​
author img

By

Published : Nov 19, 2022, 8:22 PM IST

Bokaro Express Train stopped in Regupalem: రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ట్రైన్​ను నిలిపేశారు. ఈ సంఘటన ఏపీలోని అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం రైల్వేస్టేషన్​లో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే బొకారో ఎక్స్​ప్రెస్​లో జరిగింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బొకారో రైలులో ప్రయాణికుల మధ్య ఏర్పడిన గొడవ కారణంగా రైలు రెండు గంటల పాటు అనకాపల్లి జిల్లా రేగుపాలెం రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది.

ఒడిశాకు చెందిన వారు జనరల్‌ టికెట్‌ తీసుకుని రిజర్వేషన్‌ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించటంతో వివాదం మొదలైంది. రిజర్వేషన్‌ లేని వారిని జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాలని ఆర్​పీఎఫ్ పోలీసులు చెప్పటంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ట్రైన్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రయాణికుల ఆందోళన కారణంగా రైలు ఆలస్యంగా బయలుదేరింది.

రేగుపాలెం రైల్వేస్టేషన్​లో నిలిచిపోయిన బొకారో ఎక్స్​ప్రెస్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.