ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఇప్పుడే ప్రవేశాల ప్రక్రియ చేపట్టవద్దని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీలు ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని పాపిరెడ్డి తెలిపారు. అయితే ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ప్రవేశాలు కల్పిస్తూ.. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నత విద్యా మండలి ఖరారు చేసే విద్యా సంవత్సరానికి కట్టుబడి ఉండాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశాలు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తే ప్రైవేట్ డిగ్రీ కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామని పాపిరెడ్డి హెచ్చరించారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం