ETV Bharat / state

పూలు, పండ్లతో ప్రకృతి ఛాయ్​... తాగేసేయ్​ - green tea price

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తీసుకునే వేడి వేడి ఔషధం టీ. అల్లం టీ, మసాలా టీ, గ్రీన్ టీ, ఇరానీ ఛాయ్​... ఇలా ఎన్నో రకాల టీలు ఉన్నా... అవన్నీ కేవలం టీపొడితో చేసినవే. కానీ అందుకు భిన్నంగా ఆరోగ్యకరమైన విభిన్న రకాల టీలు తయారు చేయొచ్చని నిరూపించారు నీలిమ. టీ తాగే తన అలవాటునే వ్యాపారంగా మార్చుకుని.. ఎన్నో రకాల వెరైటీలను నగర వాసులకు పరిచయం చేస్తోంది. ఆడవారు వంటింట్లో పనిచేయడం మాత్రమే కాదు.. తాము చేసే పనినే వ్యాపారంగా మార్చుకోవచ్చని నిరూపించింది.

పూలు, పండ్లతో ప్రకృతి ఛాయ్​... తాగేసేయ్​
author img

By

Published : Oct 21, 2019, 7:09 AM IST

పూలు, పండ్లతో ప్రకృతి ఛాయ్​... తాగేసేయ్​

పని ఒత్తిడి ఎక్కువైనా... సాయంత్రం స్నేహితులతో కబుర్లు చెబుతున్నా... ఓ కప్పు టీ కడుపులో పడితే కలిగే ఆనందమే వేరు. రోజూ ఒకే టీ తాగితే ఏముంటుంది మజా. రోజుకో వెరైటీ అయితే బాగుుటంది కదా. ఇలాంటి వారి కోసమే కొత్తకొత్త రుచులు పరిచయం చేస్తోంది నీలిమ.

సరికొత్తగా పూలు పండ్లతో పరిచయం చేసింది. ఎగ్జోటిక్​ బ్లూమింగ్​ టీ పేరుతో విదేశాల్లో ఎక్కువగా లభించే ప్రకృతి టీలను మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జాస్మిన్, హైబిస్కస్, రోజ్ ఇలా ఒకటేమిటీ వాటిలో ఫ్లేవర్లు కలిపి ముప్పైకి పైగా పూల టీలను ఆస్వాదించే అవకాశం కల్పించింది.

ఈ కథనం చదవండి: మగువల మనసు దోచే గాజులు

రెడి టూ డ్రింగ్​ టీ:

ఎక్జోటిక్ బ్లూమింగ్ టీలలో వాడే పూలు చాలా ప్రత్యేకం. ప్రస్తుతం నగరంలో మొత్తం మూడు స్టోర్​లతో పాటు.... ఆన్​లైన్​లోనూ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ క్యాంపస్​లో నీలిమ నిర్వహిస్తున్న స్టోర్ మరింత ప్రత్యేకమనే చెప్పాలి. ఒకప్పుడు పెద్దగా ఎవరికీ పరిచయం లేని ఈ బ్లూమింగ్ టీలలో సొంతంగా వివిధ రకాల ఫ్లేవర్లతో బ్లెండ్ చేసి అందించటం నీలిమ ప్రత్యేకత. అంతేకాదు దీపావళి కోసం ప్రత్యేకంగా స్నేహితులు, బంధువులకు కానుకలుగా ఇచ్చేందుకు కప్​లలో రెడీ టూ డ్రింక్ టీలను గిఫ్ట్ ప్యాక్​లను అందిస్తోంది. విదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన టీల రుచినే కాదు... వాటిలోని సుగుణాలను సైతం మనవారికి అందించాలన్న లక్ష్యంతోనే ఈ వ్యాపారం ప్రారంభించానంటోంది నీలిమ.

ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యంగా:

ఈ వ్యాపారం అంత సులభం కాదంటున్నారు నీలిమ. వినూత్న ఆలోచన, మార్కెటింగ్​తో​ ప్రపంచ వ్యాప్తంగా వంద స్టోర్లను ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని చెబుతోంది.

ఈ కథనం చదవండి: అవును.. ఈ పువ్వులు వాడిపోవు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.