దేశంలో అధిక రక్తపోటు వ్యాధిగ్రస్తులు గణనీయంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోందని మెడికల్, ఇరీస్ లైఫ్ సైన్సెస్స్ ప్రైవేటు లిమిటెడ్ అధ్యక్షుడు డాక్టర్ విరాజ్ సువర్ణ అన్నారు. ఇండియా హార్ట్ స్టడీ ఐహెచ్‌ఎస్ అధ్యయనంపై హైదరాబాద్‌లో జరిగిన చర్చా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 15 రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇండియా హార్ట్ స్టడీ పేరిట నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనంలో విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడయ్యాయని చెప్పారు. 1233 మంది వైద్య నిపుణులు సమక్షంలో 18,918 మంది రక్తపోటు రీడింగ్ తీసుకొని పరీక్షలు నిర్వహించారు. ఇందులో 42 శాతం మందికి వైట్ కోట్, మాస్క్ హైపర్‌టెన్సివ్ ఉన్నట్లు తేలిందన్నారు. ఇది తొలిసారిగా వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. దీన్ని గుర్తించి చికిత్స చేయించుకోకపోతే గుండె, మూత్రపిండాలు ,మెదడు సమస్యలు వస్తాయని, అకాల మరణాలు కూడా తలెత్తుతాయని వివరించారు. వ్యాయామాలు చేయడం, ఔషధాలను వాడడం ద్వారానే రక్తపోటును అధిగమించవచ్చునని చెప్పారు.
ఇదీ చూడండి:ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరం అరెస్టు తప్పదా?