రక్తం దొరక్క 30 ఏళ్ల కిందట తన తండ్రి పడిన ఇబ్బందిని ఎవరూ పడకూడదని నిర్ణయించుకున్నాడో కుమారుడు. అప్పటి నుంచి ప్రతి ఏటా మూడు విడతలుగా రక్తదానం చేస్తూ.. ప్రాణదాతగా మారాడు. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా సాగర్నగర్కు చెందిన సాయిబాబా శ్రీనివాస్ ఇప్పటి వరకు వందసార్లు రక్తదానం చేశారు. 100వ సారి రక్తదానం చేసిన సందర్భంగా ఏఎస్ రక్తనిధి కేంద్రం వారు సర్టిఫికెట్ అందించినట్లు శ్రీనివాస్ తెలిపారు.
రక్తదానం చేయటం వల్ల దాతకు ఎలాంటి అనారోగ్యం కలగదన్నారు. తనను ఆదర్శంగా తీసుకొని చాలా మంది రక్తదానం చేయటానికి ముందుకొచ్చారని వెల్లడించారు. మరణానంతరం తన అవయవాలను వైద్యశాలకు అందించేలా అంగీకార ప్రతం అందించనట్లు శ్రీనివాస్ తెలిపారు.
ఇదీచదవండి: దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం