రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 75 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రక్తదానం చేశారు. ఉత్తమ్, పలువురు కాంగ్రెస్ నేతలు రాజీవ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు.
ఇదీ చూడండి :'రాజీవ్ నిర్ణయాలే సమాచార విప్లవానికి పునాది'